ప్రమాద బీమా పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమే. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో ఆసరానిస్తుంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది.
రోజుకు రెండు రూపాయలు కడతే, పదిహేను లక్షలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో కలిసి తపాలా శాఖ సంయుక్తంగా ఈ ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది.
అర్హతలు :
- బీమా పాలసీని 18నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు
- పాలసీ తీసుకోడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది
- ఆధార్ కార్డు, దానితో లింక్ అయిన ఫోన్ నంబరు ఉండాలి
- కొందరికి వైద్య పరీక్షలు చేసిన తరవాత పాలసీ ఇస్తారు
- సాయుధ బలగాలకు ఈ పాలసీ వర్తించదు
చెల్లించాల్సిన ప్రీమియం :
- రోజుకు రూ.1.50తో రూ.10లక్షలు, రూ.2లతో రూ.15లక్షలు విలువైన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి
- ఏడాదికి రూ.549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ.10లక్షలు, రూ.749 ప్రీమియంతో రూ.15లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయి
బీమా కవరేజ్ :
- ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా సొమ్ము చెల్లిస్తారు
- అంగవైకల్యం కాని, పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది.
- ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఒ.పి.డి రూ.30 వేలు, లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10సార్లు రూ.1500 విలువైన కన్సల్టేషన్లు వర్తిస్తాయి
- ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే రూ.60 వేల వరకు చెల్లిస్తారు
- ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు లభిస్తుంది.. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటినే చెల్లిస్తారు
- ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ.లక్ష వరకు బీమా కవర్ ఉంటుంది
- ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం రూ.లక్ష వరకు వస్తుంది
- తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే నాలుగు కన్సల్టెంట్‌లు ఉచితం
- ఒకరికి ప్రమాదం జరిగి వేరేచోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి రూ.25 వేల వరకు చెల్లిస్తారు
- ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.5 వేల వరకు వస్తుంది.
































