PM-Kisan: రైతులకు శుభవార్త… అప్పుడే ఖాతాలలో రూ. 2 వేలు జమ

దేశ రైతులకు మోడీ ప్రభుత్వం ( Modi Govt) శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan 20th Installment) పథకానికి సంబంధించిన డబ్బులను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది మోడీ సర్కార్.


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత డబ్బులను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారట అధికారులు. ఈనెల 18వ తేదీన లేదా 19వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో పడబోతున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 20వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ( Pm Narendra Modi) బీహార్ ( Bihar) పర్యటనకు వెళ్ళనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… బీహార్ లో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఇక మరోసారి ఈనెల 20న బీహార్ వెళ్ళనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే అంత కంటే రెండు రోజుల ముందే.. పిఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారట. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

కాగా పీఎం కిసాన్ పథకం కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలు అందిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ 6000 రూపాయలను ప్రతి ఏడాది మూడు విడతలలో.. 2000 రూపాయల చొప్పున రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు 19 విడతలు విడుదల చేసింది మోడీ ప్రభుత్వం. ఈసారి 20వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ డబ్బులను పెట్టుబడి కోసం రైతులు వాడుకునేలా మోడీ ప్రభుత్వం అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.