ఒక్క రూపాయి కట్టకుండా.. డెబిట్ కార్డు పై రూ.20 లక్షల ఇన్సూరెన్స్?

మనీ ట్రాన్సాక్షన్ కోసం డెబిట్ కార్డ్ తప్పనిసరిగా మారింది. చిరు ఉద్యోగుల నుంచి బడ వ్యాపారుల వరకు ఫైనాన్సు ట్రాన్సాక్షన్ చేసేందుకు లిక్విడ్ క్యాష్ కు బదులు ఏటీఎం కార్డ్స్ వాడుతున్నారు.


బ్యాంకులో సరైన నగదు నిల్వను ఉంచి కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే డెబిట్ కార్డ్ అనగానే మనకు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఉపయోగపడే కార్డు మాత్రమే అనుకుంటాం. కానీ ఈ డెబిట్ కార్డు ద్వారా 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా బ్యాంకు అకౌంట్ ఉన్నవారు డెబిట్ కార్డ్ ఈ రోజుల్లో తప్పనిసరిగా తీసుకుంటున్నారు. డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేస్తున్నారు. డెబిట్ కార్డు జాగ్రత్తగా ఉంచుకుంటేనే బ్యాంకు అకౌంట్లో డబ్బులు సేఫ్ గా ఉంటాయి. అయితే ఈ కార్డు కేవలం డబ్బులు తీసుకోవడానికి మాత్రమే కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తుంది. ఒక్క బ్యాంకు అని కాకుండా ప్రతి బ్యాంకు ఇచ్చే డెబిట్ కార్డు పై ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలి? ఏ ఇన్సూరెన్స్ కు వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం..

ప్రతి డెబిట్ కార్డ్ పై ఐదు రకాల ఇన్సూరెన్స్లు వర్తించే అవకాశం ఉంటుంది. వీటిలో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అంటే ఏ వ్యక్తి పేరు మీద డెబిట్ కార్డు ఉంటుందో ఆ వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే అతనికి రూ. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అయితే ఈ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్ కు మాత్రమే. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు లు మాత్రం రూ. రెండు లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తున్నారు. మిగతా బ్యాంకులు ఖాతాదారుడి ట్రాన్సాక్షన్ ప్రకారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంటారు.

డెబిట్ కార్డు పై కేవలం రిస్క్ కవరేజ్ మాత్రమే కాకుండా ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినా.. లేదా ఇతర రకంగా ఇంజ్యురుడు అయిన కూడా కవరేజ్ వర్తిస్తుంది. అయితే అది ప్రమాద తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. ఒకవేళ డెబిట్ కార్డు హోల్డర్ మరణిస్తే అతని నామినీకి ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. లేదా గాయాలు అయితే అతనికి ఇన్సూరెన్స్ను అందిస్తారు.

అయితే ఈ ఇన్సూరెన్స్ వర్తించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. డెబిట్ కార్డు పై కనీసం 45 నుంచి 90 రోజుల్లో ఒక ట్రాన్సాక్షన్ అయినా చేసి ఉండాలి. 18 నుంచి 70 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వీసా వంటి డెబిట్ కార్డులకు తక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ వర్తించగా.. ప్రీమియం కార్డులకు ఎక్కువగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం బ్యాంకులో అడిగే ధ్రువపత్రాలను అందించాలి. వీటిలో ప్రమాదం జరిగితే ఎఫ్ఐఆర్ కాపీ, మరణం జరిగితే డెత్ సర్టిఫికెట్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ సంబంధించిన రిపోర్ట్ వంటివి బ్యాంకులకు సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత కొన్ని రోజులకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.