రూ.5.50 లక్షలు.. పైగా 5 స్టార్ సేఫ్టీ, 27 కి.మీ మైలేజ్.. అందుకే కస్టమర్లు టాటా షోరూమ్‌కు క్యూ కట్టారు

టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటినుంచో భారత ఆటోమొబైల్ రంగంలో భద్రత, నాణ్యత, విశ్వసనీయత అనే మూడు ప్రధాన అంశాలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది.


ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే ప్రతి వాహనం మంచి సేఫ్టీ రేటింగ్‌లు, బలమైన నిర్మాణం, ఆధునాతన టెక్నాలజీతో వినియోగదారుల మనసులను గెలుచుకుంటుంది. అలాంటి వాహనాల్లో ఒకటి టాటా పంచ్ (Tata Punch). టాటా పంచ్ భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చిన్న SUV సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఇది మైక్రో SUVగా పిలవబడుతున్నప్పటికీ, దీని లుక్స్‌, గ్రౌండ్ క్లియరెన్స్‌, ఫీచర్లు పెద్ద SUVలకు ఏమాత్రం తగ్గవు. తాజాగా విడుదలైన సెప్టెంబర్ 2025 నెల సేల్స్ గణాంకాలు చూస్తే, టాటా పంచ్ విజయ గాధ కొనసాగుతున్నదని స్పష్టమవుతుంది.

సెప్టెంబర్ నెలలో మొత్తం 15,891 యూనిట్ల పంచ్‌ కార్లు విక్రయించబడ్డాయి. ఇది టాటా మోటార్స్ అమ్మకాలలో గణనీయమైన వాటా. పంచ్ ఇప్పటికీ కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ అద్భుతమైన అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఇటీవల వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు తగ్గించడం పంచ్ ధరపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఫలితంగా, ఈ కారు ధర దాదాపు రూ.85,000 వరకు తగ్గింది.

ధర తగ్గడంతో వినియోగదారులు మరింత ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. టాటా పంచ్ ఎప్పటినుంచో ధరకి తగిన విలువ ఇచ్చే కార్‌గా పేరుపొందింది. ఇప్పుడు ధర మరింత సులభమైన స్థాయికి చేరడంతో దానికి మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. ఇక పండుగ సీజన్ కూడా పంచ్ అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపింది. దసరా సందర్భంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనే ఆచారం భారతీయ వినియోగదారుల్లో బలంగా ఉంది.

ఆ ఉత్సాహం ఈ సారి టాటా షోరూమ్‌లలో మరింత ఎక్కువగా కనిపించింది. చాలా మంది వినియోగదారులు సేఫ్టీ కూడా, స్టైల్ కూడా అనే ఆలోచనతో పంచ్ SUVని ఎంపిక చేస్తున్నారు. అదే విధంగా, జూన్ నుండి ఆగస్టు వరకు టాటా పంచ్ 31,935 యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే, కంపెనీ మూడు నెలల కాలంలో సుస్థిరమైన డిమాండ్‌ను కొనసాగించగలిగింది. ఇది పంచ్‌కి ఉన్న నిరంతర ప్రజాదరణకు మరో నిదర్శనం.

ధర పరంగా చూస్తే, టాటా పంచ్ చాలా సరసమైన రేంజ్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ కార్‌కి ప్రారంభ ధర రూ. 5.50 లక్షలు, అయితే టాప్ వేరియంట్ ధర రూ. 9.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధరలతో పంచ్ SUV తన సెగ్మెంట్‌లో అత్యంత విలువైన ఆఫర్‌గా నిలుస్తోంది. ఈ SUVలో 5 సీట్లు ఉన్నాయి. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది అత్యంత అనువైన కారు.

పర్ఫార్మెన్స్ విషయంలో టాటా పంచ్ తన తరగతిలో ప్రత్యేకంగా నిలుస్తోంది. దీంట్లో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే CNG వెర్షన్ కూడా లభిస్తుంది. ఈ ఇంజిన్‌ శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా, మెరుగైన మైలేజీని కూడా అందిస్తుంది. టాటా పంచ్‌లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అలాగే 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT) ఆప్షన్లు ఉన్నాయి, కాబట్టి వినియోగదారులు తమ అవసరాలకు తగిన వెర్షన్‌ని ఎంచుకోవచ్చు.

మైలేజీ విషయానికి వస్తే, ఈ SUV పెట్రోల్ వెర్షన్‌లో లీటరుకు సుమారు 18 కి.మీ, ఇక CNG వెర్షన్‌లో కిలోకు దాదాపు 27 కి.మీ వరకు మైలేజీ అందిస్తుంది. ఇది సిటీ డ్రైవ్‌కి, హైవే ట్రిప్‌లకు రెండింటికీ సరైన కాంబినేషన్. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పంచ్ కారు 5 సేఫ్టీ రేటింగ్ పొందింది. దీనిలో డజన్ల కొద్ది అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.