రోజుకు రూ.500తో పాటు 15వేలు, ఇంకా రెండు లక్షల లోన్.. వారికి అదిరిపోయే పథకం

దేశంలోని అన్ని వర్గాల ఉన్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రం దేశ ప్రజల ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి.


వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తున్నాయి.

18రకాల వృత్తి కళాకారులకు ఆర్థికంగా మద్దతు

భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17 2023 పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించి కులవృత్తులు చేసే వారికి మద్దతును అందించడానికి అందుబాటులోకి తీసుకువచ్చారు.పీఎం విశ్వకర్మ పథకం ద్వారా సాంప్రదాయ చేతివృత్తులలో నిమగ్నమైన 18రకాల వృత్తి కళాకారులకు ఆర్థికంగా మద్దతును ఇవ్వనున్నారు.

రోజుకు రూ.500 ఇచ్చి శిక్షణ

ఎవరైతే ఈ విశ్వకర్మ పథకంలో అప్లై చేసుకుంటారో వారికి ప్రతిరోజు 500రూపాయలు చెల్లించి అవసరాన్ని బట్టి వారం నుండి 15 రోజులపాటు వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించి వారికి లోన్లు ఇచ్చి చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విశ్వకర్మ యోజన పథకం చాలామంది చేతివృత్తుల వారికి ఆసరాను అందిస్తుంది పనిచేసే వారికి 2023 నుంచి 2028 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉంటుందని కూడా ప్రధాని తెలిపారు.

5 శాతం వడ్డీకే రుణాలు

పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తుల వారు, కళాకారులు సర్టిఫికెట్ తో పాటు గుర్తింపు కార్డును పొందుతారు. తొలి విడత లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయల రుణాన్ని పొందుతారు. ఇక వీరు తీసుకున్న రుణంపైన కేవలం ఐదు శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు.

18 రకాల వృత్తుల వారు ఈ పథకం పొందడానికి అర్హులు

ఇది ఇతరులతో పోలిస్తే చాలా తక్కువ. వడ్రంగి పని చేసేవారు, స్వర్ణకారులు, కమ్మరి, కుమ్మరి, తాపీ పని చేసేవారు, సాంప్రదాయక బొమ్మలు తయారు చేసేవారు, లాండ్రీ, టైలర్ ఇలా 18 రకాల వృత్తుల వారు ఈ పథకం పొందడానికి అర్హులు. ట్రైనీలకు రోజుకు 500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయడమే కాక పనిముట్లను కొనుగోలు చేసుకోవడానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు.

30 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఈ పథకం ద్వారా మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా చేతివృత్తుల వారి ఆర్థిక అభ్యున్నతికి దోహదం చేసే ఈ పథకాన్ని అసలు మిస్ చేసుకోకండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.