8GB ర్యామ్‌, 50MP కెమెరా Samsung స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 తగ్గింపు..బ్యాంక్‌కార్డుతో రూ.10వేల అదనపు డిస్కౌంట్‌

శాంసంగ్ గత సంవత్సరం అక్టోబర్‌లో Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్ల ధరను రూ.5000 తగ్గిస్తూ శాంసంగ్‌ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌ వేరియంట్లు : శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ధర తగ్గింపుతో 128GB వేరియంట్‌ ధర రూ.54,990, 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.64,990కు కొనుగోలు చేయవచ్చు.
ఈ రూ.5000 శాశ్వత తగ్గింపు తోపాటు శాంసంగ్‌ మరో ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌ ను HDFC క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.10,000 అదనపు తగ్గింపును పొందుతారు. ఫలితంగా ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ను రూ.49,990 కే కొనుగోలు చేయవచ్చు. మరియు 256 GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.54990కు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్‌ గెలాక్సీ S23 FE ఫీచర్లు : శాంసంగ్‌ గెలాక్సీ s23 FE స్మార్ట్‌ ఫోన్‌ 6.4 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విజన్‌ బూస్టర్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన అవుట్‌ డోర్‌ విజిబిలిటీని అందిస్తుంది.
శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు : ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 3X జూమింగ్‌ మరియు OIS సపోర్టుతో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. తొలిసారిగా ఈ హ్యాండ్‌సెట్‌ ద్వారా నైటోగ్రఫీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కెమెరాపైన నియంత్రణ, కస్టమైజేషన్‌ కోసం కెమెరా అసిస్టెంట్‌ యాప్‌ను కలిగి ఉంటుంది.
Reno 11 Pro vs iQOO Neo 7 Pro

Samsung Galaxy S23 FE smartphone
గూగుల్‌ జెమినిపై సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు.. ఈ AI మోడల్‌ చాలా భిన్నమని వెల్లడి!గూగుల్‌ జెమినిపై సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు.. ఈ AI మోడల్‌ చాలా భిన్నమని వెల్లడి!
శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు : ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 3X జూమింగ్‌ మరియు OIS సపోర్టుతో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. తొలిసారిగా ఈ హ్యాండ్‌సెట్‌ ద్వారా నైటోగ్రఫీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కెమెరాపైన నియంత్రణ, కస్టమైజేషన్‌ కోసం కెమెరా అసిస్టెంట్‌ యాప్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ బ్యాటరీ వివరాలు : గెలాక్సీ S23 FE స్మార్ట్‌ ఫోన్‌ Exynos 2200 చిప్‌ ఆధారంగా పనిచేస్తుంది. గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జత చేయబడుతుంది. మరియు 4nm ఆధారిత ఆక్టాకోర్‌ చిప్‌ మెరుగైన గేమింగ్‌ అనుభూతిని అందిస్తుంది. మరియు ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత One UI 5.1 OSపైన పనిచేస్తుంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.