బెంగళూరులో ఒకటో క్లాస్ కు రూ. 7.50 లక్షలు ఫీజా?

 ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దోపిడీ.. లక్షల రూపాయల్లో అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తోన్నారనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. బెంగళూరులో చోటు చేసుకుంది.


ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. ఒకటో తరగతికి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేయడం హాట్ డిబేట్ గా మారింది.

ఒకటో తరగతి కోసం ఏకంగా 7,35,000 రూపాయలను వసూలు చేసిందో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి.. ఫీజ్ స్ట్రక్చర్ తో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా యూజర్లు, నెటిజన్లు మండిపడుతున్నారు. సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తరగతికి వార్షిక ఫీజు అక్షరాలా రూ. 7.35 లక్షలు వసూలు చేయడం నెటిజన్ల దిమ్మతిరిగేలా చేస్తోంది.

11వ తరగతికి రూ. 11 లక్షలను వసూలు చేస్తోండటం మైండ్ బ్లాక్ అవుతోందని కామెంట్స్ పెడుతున్నారు. ఎక్స్ యూజర్ హార్దిక్ పాండ్యా తన అకౌంట్ లో ఈ ఫీజ్ స్ట్రక్చర్ ను పోస్ట్ చేశాడు. ఇందులో ఉన్న వివరాల ప్రకారం- ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థికి వార్షిక ఫీజు రూ. 7,35,000. ఈ ఫీజును రెండు టర్మ్‌లలో చెల్లించాలి. ఒక్కో టర్మ్‌కు కట్టాల్సిన స్కూల్ ఫీజు రూ. 3,67,500. అడ్మిషన్ సమయంలో మరో 1,00,000 రూపాయలు కట్టాలి. ఇది నాన్-రిఫండబుల్. అంటే అడ్మిషన్ దొరికినా, దొరక్కపోయినా ఈ ఫీజును రిటర్న్ ఇవ్వరన్నమాట.

అప్లికేషన్ ఫామ్ కోసం మరో రూ. 1,000 అదనంగా చెల్లించాలి. ఉన్నత చదువులు చదువుతున్న కొద్దీ ఫీజులు భారీగా పెరుగుతాయి. 11, 12 తరగతులకు పేరెంట్స్ చెల్లించాల్సిన వార్షిక ఫీజు ఏకంగా రూ. 11,00,000. ఈ స్కూల్ పేరు నీవ్ అకాడమీ. ఇది ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అనుబంధ సంస్థగా చెబుతున్నారు నెటిజన్లు. ఈ ఫీజుల వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హాట్ డిబేట్ గా మారింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.