ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేలలోపు ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన వివో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై18ఐ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై18ఐ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. రూ. 10వేలలోపు ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
వివోవై18ఐ ఫోన్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 7,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఈ ఫోన్‌లో స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 64 జీబీ వరకూ పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, బైదూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ 2.0 పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేట్ ను అందించారు.