రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170 కి.మీ. పూర్తి వివరాలు ఇవి..

www.mannamweb.com


లక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు చాలా వేగంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ వాహనాల స్థానాన్ని ఆక్రమించేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి.

లోకల్ అవసరాలకు సరిగ్గా సరిపోతుండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో కంపెనీల మధ్య కూడా పోటీ వాతావరణ ఏర్పడుతోంది. టాప్ బ్రాండ్లతో పాటు చాలా స్టార్టప్స్ కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఐవూమి(iVoomi) బ్రాండ్ ఓ కొత్త ఈ-స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఐవూమి జీత్ ఎక్స్ జెడ్ఈ(iVoomi JeetX ZE). దీని ధర రూ. 99,999 ఎక్స్-షోరూమ్. దీనిలో బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 170 కిమీ రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్థానిక రిజి స్ట్రేషన్లతో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో మొదటగా విక్రయాలు జరుపుతోంది. ఈ కొత్త వేరియంట్ డెలివరీలు జూలై చివరిలో లేదా ఆగస్టులో రెండో వారంలో ప్రారంభమవుతాయి.

ఐవూమి జీత్ ఎక్స్ జెడ్ఈ స్పెసిఫికేషన్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. ఎకో, రైడర్, స్పీడ్ వంటివి ఉన్నాయి. ఈ రైడింగ్ మోడ్లలో వరుసగా 170 కిమీ, 140 కిమీ,130 కిమీ రైడింగ్ రేంజ్ ను కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. ముందు భాగంలో ఉన్న టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉంటాయి. బ్రాండ్ బ్యాటరీ ప్యాక్ పై ఐదేళ్ల వారంటీని అందిస్తోంది.

ఐవూమి సీఈఓ, వ్యవస్థాపకుడు అశ్విన్ భండారి మాట్లాడుతూ జీట్ ఎక్స్ జెడ్ 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ను పరిచయం చేయడం ద్వారా ఆవిష్కరణ, కస్టమర్ అవసరాలను తీర్చడంపై తమ దృష్టిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాము అధునాతన సాంకేతికత, అత్యుత్తమ పనితీరు, గొప్ప విలువను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఈ కొత్త మోడల్ ఆధునికతను ఇష్టపడే ప్రస్తుత జనరేషన్ కు నచ్చే విధంగా స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుందని చెప్పారు.

ఐవూమి ఎస్1 ఎలక్ట్రిక్..

జీత్ ఎక్స్ జెడ్ఈ స్కూటర్ కన్నా ముందు ఐవూమి ఎస్1 పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది ఏకంగా 240 కిలమీటర్ల రేంజ్ ను క్లయిమ్ చేస్తోంది. అలాగే ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో ఉంది. ఇది 85 కిమీ పరిధిని అందిస్తుంది. దీని ధర రూ. 54,999 ఎక్స్-షోరూమ్. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ పై ఆధారపడి స్కూటర్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్లు లేదా 55 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇవి గ్రాఫేన్ బ్యాటరీ ప్యాక్, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లతో వస్తాయి.