రూ. 10వేలలో ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదిగో ఇవే బెస్ట్‌ ఆప్షన్స్‌..

www.mannamweb.com


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు పలు గృహోకరణాలపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించారు. ఇందులో భాగంగానే పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఇలా ఈ సేల్‌లో రూ. 10వేల లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

itel Color Pro 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 13,499గా ఉండగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 26 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన ఏఐ కెమెరాను అందంచారు. అలాగే 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

Nokia G42 5G: రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్ ఫోన్స్‌లో నోకియా జీ42 ఫోన్‌ ఒకటి. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 12,999కాగా సేల్‌లో భాగంగా రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ ఏఐ కెమెరాను అందించారు. 2 ఏళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ ఉచితంగా పొందొచ్చు.

POCO C65: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 11,999కాగా సేల్‌లో భాగంగా 39 శాతం డిస్కౌంట్‌తో రూ. 7099కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

Redmi 13C: రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో రెడ్‌మీ13సీ ఫోన్‌ ఒకటి. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 13,999కాగా, 39 శాతం డిస్కౌంట్‌తో రూ. 8499కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌ సొంతం.

Samsung Galaxy M14: ఈ స్మార్ట ఫోన్‌ అసలు ధర రూ. 13,999కాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా 40 శాతం డిస్కౌంట్‌తో రూ. 8,394కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, స్నాప్‌ డ్రాగన్‌ 60 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.