రాఖీని కట్టేందుకు నియమాలు.. పూజా విధానం, పూర్తి సమాచారం తెలుసుకోండి

www.mannamweb.com


హిందూ సంప్రదాయంలో రాఖీ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ పండుగను జరుపుకుంటారు. పూర్వకాలంలో రాఖీ పండుగ రోజున గురువులు తమ శిష్యులకు రక్షా సూత్రాన్ని కట్టేవారు.

దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు.. ఇంద్రాణి ఇంద్రుడికి రక్ష సూత్రాన్ని కట్టింది. అయితే ఇప్పుడు అది ఇప్పుడు సోదర సోదరమణుల మధ్య అనురాగానికి ప్రతీకగా మారింది. కాశీ జ్యోతిష్యశాస్త్ర ఆచార్య పవన్ త్రిపాఠి మాట్లాడుతూ.. సనాతన సంప్రదాయంలో భద్రనీడ లేని సమయంలో పండుగను జరుపుకునే సంప్రదాయం ఉందని.. అయితే భద్ర నీడలో జరుపుకోని రెండు పండుగలు ఉన్నాయని చెప్పారు. హోలికా దహనం, రాఖీ పండుగ అనేవి భద్ర కాలంలో జరుపుకోకూడని రెండు పండుగలు.

భద్రా కాలంలో సోదరీమణులు రక్షా సూత్రాన్ని కట్టకూడదు

ఆగస్టు 19న తెల్లవారుజామున 2.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.24 గంటల వరకు భద్ర కాల సమయం ఉంటుందని ఆచార్య పవన్ త్రిపాఠి తెలిపారు. ఈ సమయంలో రాఖీ పండగను జరుపుకోకూడదు లేదా రక్షా సూత్రాన్ని ఏ విధంగానూ కట్టకూడదు. జ్యోతిష్యం ప్రకారం హోలిక దహనం కూడా భద్ర నీడ సమయంలో చేయడం వలన దేశానికి నష్టం జరుగుతుంది. అదే విధంగా రక్షా బంధన్‌ను జరుపుకోవడం సోదర సోదరమణులకు చాలా అశుభం.. ఇబ్బందులను ఆహ్వానించడమే. భద్ర కాల సమయం ప్రతికూల శక్తిని ఇచ్చే సమయంగా పరిగణించబడుతుంది.

రక్షా సూత్రాన్ని ఎప్పుడు, ఎలా కట్టాలి

ఆగస్ట్ 19 మధ్యాహ్నం 1.25 గంటల తర్వాత రాఖీ పండగను మీరు కోరుకున్నంత సమయం జరుపుకోవచ్చని ఆచార్య పవన్ త్రిపాఠి చెప్పారు. సోదర సోదరమణులు ఈ పవిత్రమైన పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి మార్కెట్ నుండి సింథటిక్ రాఖీని కొనుగోలు చేయడానికి బదులుగా ఇంట్లోనే రక్షా సూత్రాన్ని సిద్ధం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. రక్ష సూత్రాన్ని పట్టు లేదా పత్తి దారంలో కుంకుమ, అక్షతలు, దర్భ, బంగారు రంగు దారంతో సిద్ధం చేసుకోండి. పూజా స్థలంలో రక్షా సూత్రాన్ని పూజించండి. రక్షా సూత్రానికి ధూపం, హారతి సమర్పించండి. “ఓ రక్షా సూత్ర దేవతా ఈ రక్ష సూత్రంలో స్థిరపడడం కోసం మేము నిన్ను ఆరాధిస్తున్నామ(हे रक्षा सूत्र के देवता आप इस रक्षासूत्र में स्थापित हो जाइए हम आपकी पूजा कर रहे हैं) పూజ చేయండి.

రాఖీ కట్టేందుకు నియమం

రాఖీతో అలంకరించిన ప్లేట్‌ని తీసుకుని సోదరి తన సోదరుడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తాను పడమర ముఖంగా ఉండి.. నుదుట కుంకుమ పెట్టాలి. అక్షతలను సోదరుడికి వేయాలి. ఆ తరువాత సోదరి సోదరుడికి మిఠాయిలు తినిపించాలి. సోదరుడు స్వీట్లు తింటున్నప్పుడు సోదరి ఈ మంత్రాన్ని జపిస్తూ సోదరుడి కుడి చేతికి రక్షా సూత్రాన్ని కట్టాలి. “యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః| తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల” అంటూ మణికట్టుకి రక్షా సూత్రం కట్టాలి. ఆ తర్వాత సోదరి ప్లేట్‌లో తెచ్చిన కానుకను సోదరుడికి పెట్టాలి. ఇలా సోదర సోదరమణుల మధ్య ప్రేమానురాగాలను పెంచి కుటుంబ ఐక్యతను కాపాడే పండుగగా ఈ రక్షా బంధన్ నిలిచిపోతుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.