రూపే – వీసా కార్డ్ మధ్య తేడా తెలుసా? 90% మందికి తెలియదు

ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఫలితంగా నగదు వినియోగం తగ్గుతోంది. దాంతో ఆన్‌లైన్ లావాదేవీల కోసం ప్రజలు నెట్‌బ్యాంకింగ్ , UPIని ఉపయోగిస్తున్నారు.
చాలా మంది కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా కార్డ్‌లను ఉపయోగిస్తుంటే, ఈ కార్డులపై రూపే లేదా వీసా రాసి ఉంటుంది చూడండి. అయితే చాలా మంది ఈ కార్డులను ఉపయోగిస్తున్నారు కానీ వాటి మధ్య తేడా తెలియదు.


రూపే కార్డ్ అంటే ఏమిటి?
NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా )2012లో రూపే కార్డ్‌ను ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్. ఇది ఇండియన్ పేమెంట్స్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 200+ దేశాల్లో 42.4 మిలియన్ POS స్థానాలు , 1.90 మిలియన్ ATM స్థానాల్లో దీనిని వాడుతున్నారు.
వీసా కార్డ్ అంటే ఏమిటి?
మీ డెబిట్ కార్డ్‌పై వీసా అని రాసి ఉంటే.. అది వీసా నెట్‌వర్క్ కార్డ్. ఇతర ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం ద్వారా కంపెనీ ఈ కార్డులను జారీ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపు నెట్‌వర్క్. క్లాసిక్, గోల్డ్, ప్లాటినం, సిగ్నేచర్, ఇన్ఫినిట్ వంటి అనేక రకాల వీసా కార్డ్‌లు ఉన్నాయి. అయితే అన్ని కార్డులపై ఉన్న సౌకర్యాలు భిన్నంగా ఉంటాయి.
సర్వీసు ఛార్జీలు ఉంటాయి

రూపే కార్డ్ భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్డు. ఇతర కార్డ్‌లతో పోలిస్తే రూపే కార్డు లావాదేవీల రుసుములు మొదలైనవి తక్కువ ఉంటాయి. వీసా కార్డు అంతర్జాతీయ సంస్థ. రూపాయితో పోలిస్తే వీసా కార్డ్‌కి ఎక్కువ సర్వీసు ఛార్జీలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు కార్డుల మధ్య తేడాలు ఇవే .

రూపే కార్డు భారతదేశానిది కాబట్టి వీసా కంటే వేగంగా చెల్లింపు చేసేందుకు అవకాశం ఉంది. అయితే రూపే కార్డ్ గ్రామీణ భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించారు. అయితే వీసా కార్డ్ టైర్ 1, టైర్ 2 నగరాల్లో బాగా పాపులర్ అయ్యింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.