చంద్రబాబు ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ఎందుకు వేసుకుంటారో తెలుసా

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు అది. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ప్రతిరోజు ముదురు రంగులో ఉన్న బంగారు రంగు దుస్తులు, లేదంటే గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు అని అనుకుంటారు.

కానీ అవి కాస్తంత పసుపు రంగులో ఉండే చొక్కా, ప్యాంటే. చొక్కా లేత రంగైతే, ప్యాంటు ముదురు రంగులో ఉంటుంది. నల్ల షూ ధరిస్తారు. కళ్లజోడును మాత్రం ఎప్పుడూ వాడరు. ఇటీవలి కాలం నుంచి మాత్రం ఏవైనా చదవాల్సి వచ్చినప్పుడు రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటున్నారు. అసలు చంద్రబాబునాయుడు కొన్ని సంవత్సరాల నుంచి ఒకే రంగు దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు? దీనివల్ల లాభాలేంటి? ఒకేరంగు దుస్తులు వేసుకునే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. మనస్తత్వ శాస్త్రం ప్రకారం అందుకు అనేక కారణాలున్నాయి. ఇలా వేసుకోవడంవల్ల మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరించడంవల్ల ఆ వ్యక్తికి మంచి సౌకర్యంగా అనిపిస్తుంది. అతని పాత్ర గురించి, అతని మనస్తత్వం గురించి ఎదుటివారు అంచనా వేయలేరు. మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఏ వ్యక్తైనా తన భావోద్వేగాలను ప్రతిబింబించే రంగులనే ఎంచుకుంటారు. అందుకు తగినట్లుగానే చంద్రబాబు పసుపు రంగును ఎంచుకున్నారు. ఇవి ధరించడంవల్ల అంతా మంచి జరుగుతుందనే భావనను ఆయనలో కలిగిస్తాయి. పసుపు హిందువులకు శుభసూచికం. ముందుగా ఏ పని ప్రారంభించాలన్నా పసుపును కచ్చితంగా వాడతారు.

ఆశావాదాన్ని కలిగిస్తుంది

ఒకే రంగు దుస్తులు ధరించడంవల్ల పనిమీద వెళుతున్నప్పుడు కచ్చితంగా అవుతుందనే ఆశావాదాన్ని కలిగిస్తాయి. అలాగే ఎదుటివారి దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. సంతోషంగా జీవించడానికి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి ఉపయోగపడతాయి. తమను తాము వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఒకేరకమైన దుస్తులు ధరిస్తారు. నిర్దిష్టమైన రంగును స్థిరంగా ధరించడంద్వారా వారు ఒక రూపాన్ని సృష్టించినవారవుతారు. చంద్రబాబు ధరించే దుస్తులు కూడా తెలుగుదేశం పార్టీ రంగు అయిన పసుపు రంగు కావడంతో సింబాలిక్ గా ఉంటుంది. వ్యక్తిగత బ్రాండ్ గా ప్రజల్లో ఇమేజ్ క్రియేటవుతుంది. చంద్రబాబునాయుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆయన ధరించే ఒకే రంగు దుస్తులు. ఆ తర్వాతే ఆయన ముఖం గుర్తుకు వస్తుంది. అంతగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన జీవితంతో పెనవేసుకుపోయింది. ఒకేరకమైన దుస్తులు ధరించడంవల్ల రోజు మొత్తంమీద కలిగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు మద్దతునందిస్తాయి. రాన్రాను అదే అలవాటవుతుంది. ఒకసారి అలవాటైన తర్వాత దాన్ని వదులుకోవడం కష్టమవుతుంది. అందుకే మన రాజకీయ నేతలు కూడా దాదాపుగా అందరూ తెలుపు రంగు దుస్తుల్లోనే కనపడుతుంటారు.