శామ్‌సంగ్ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి ఒకేసారి ఏకంగా నాలుగు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
గెలాక్సీ A06 5G, గెలాక్సీ F06 5G, గెలాక్సీ F16 5G, గెలాక్సీ M16 5G మోడల్స్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకా లాంచ్ డేట్ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ మోడల్స్‌కు సంబంధించిన సపోర్ట్ పేజీలు శామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. అంటే అతిత్వరలోనే ఇవి విడుదల కానున్నాయని నమ్మొచ్చు.
* మోడల్ నంబర్లు, ధృవీకరణలు
ఈ నాలుగు మోడల్స్‌ను అధికారిక మోడల్ నంబర్లతో గుర్తించడం జరిగింది. అవి గెలాక్సీ A06 5G (SM-A066B/DS), గెలాక్సీ F06 5G (SM-E066B/DS), గెలాక్సీ F16 5G (SM-E166P/DS), గెలాక్సీ M16 5G (SM-M166P/DS). ఈ మోడల్ నంబర్లు ఇంతకు ముందు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లోనూ కనిపించాయి.
దీంతో ఈ ఫోన్లు ఇండియాలో విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు, బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ గెలాక్సీ A06 5G, గెలాక్సీ F06 5G మోడల్స్ 2G, 3G, 4G LTE, 5G కనెక్టివిటీతో పాటు బ్లూటూత్, WLAN ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తాయని కన్ఫర్మ్ చేసింది.
* అంచనా వేస్తున్న ఫీచర్లు
గెలాక్సీ A06 5G & గెలాక్సీ F06 5G ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే.. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఆఫర్ చేశారు. ఇవి 4GB RAM, వన్ UI 7 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 6.7-అంగుళాల LCD డిస్‌ప్లే ఇస్తున్నారని తెలుస్తోంది.
50MP మెయిన్ సెన్సార్, 8MP సెల్ఫీ షూటర్, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ F06 5G కూడా దాదాపు A06 5G ఫీచర్లనే కలిగి ఉంటుందని, కానీ డిజైన్‌లో కొద్దిగా మార్పులు ఉండొచ్చని సమాచారం. విడుదలయ్యే దాక ఏదీ కన్ఫామ్ గా చెప్పలేం.
* గెలాక్సీ F16 5G, గెలాక్సీ M16 5G
వీటిలో అందించిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 కాగా RAM స్టోరేజీ 8GB వరకు ఉంటుంది. వీటిలో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ అందించనున్నారు. 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే వీటి సొంతం. ఈ ప్రైస్ రేంజ్‌లో ఆ డిస్‌ప్లే మరే ఫోన్‌లో కూడా కనిపించదు. సినిమా చూసే వారికి బెస్ట్ అవుతాయి.
50MP ప్రైమరీ సెన్సార్, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ వీటిలోని ఇతర ప్రత్యేకతలు. గెలాక్సీ F16 5G, M16 5G మోడల్స్, గతంలో ఇండియాలో 2024, అక్టోబర్‌లో రూ.18,999 ధరతో విడుదలైన గెలాక్సీ A16 5G రీబ్రాండెడ్ వెర్షన్లుగా భావిస్తున్నారు.
* గతంలో 4G వేరియంట్
గతంలో గెలాక్సీ A06 4G వెర్షన్ 2024, సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదలైంది. ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, 25W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. శామ్‌సంగ్ ఇంకా ఈ మోడల్స్ విడుదల తేదీ లేదా ధరను అధికారికంగా వెల్లడించలేదు.
కానీ, సపోర్ట్ పేజీలు, ధృవీకరణలు, బెంచ్‌మార్క్ లిస్టింగ్‌లు కనిపిస్తుండటంతో, లాంచ్ చాలా దగ్గరలోనే ఉంటుందని భావించవచ్చు. ధరల గురించి ఇంకా తెలియాల్సి ఉంది, కానీ ఫీచర్లు చూస్తుంటే, ఈ ఫోన్లు భారతీయ మార్కెట్‌లో అందుబాటు ధరలో లభించే 5G ఆప్షన్లుగా ఉండొచ్చు.