శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M36 5G లాంచ్ .. జూలై 12 నుంచి సేల్ ప్రారంభం, ధరలు, ఫీచర్లు ఇవే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తాజాగా తన కొత్త మోడల్ Galaxy M36 5G ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో పాటు తాజా AI ఫీచర్లు, భద్రతా పాయింట్‌లో Knox Vault వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్‌ వినియోగదారులకు ఆకర్షణీయంగా నిలుస్తోంది.


ఈ ఫోన్‌ జూలై 12 నుంచి అమ్మకానికి వస్తోంది. సామ్‌సంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుంది…

6GB RAM + 128GB స్టోరేజ్ – అసలు ధర: ₹22,999కాగా, బ్యాంక్ ఆఫర్ ధర: ₹16,999 మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ – బ్యాంక్ ఆఫర్ ధర: ₹17,999, 8GB RAM + 256GB స్టోరేజ్ – బ్యాంక్ ఆఫర్ ధర: ₹20,999.. దీని ఫీచర్స్ చూస్తే.. డిస్‌ప్లే: 6.7 అంగుళాల Full HD+ Super AMOLED, 120Hz రీఫ్రెష్ రేట్, Corning Gorilla Glass Victus+ ప్రొటెక్షన్.

ప్రాసెసర్: Exynos 1380 చిప్‌సెట్, RAM & స్టోరేజ్: గరిష్ఠంగా 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత One UI 7, బ్యాటరీ: 5000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కెమెరా సెటప్ వచ్చేసి 50MP ప్రైమరీ కెమెరా (OIS తో), 12MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో కెమెరా. సెల్ఫీ కెమెరా: 12MP ఫ్రంట్ కెమెరా. వీడియో: 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉంటుంది. మంచి డిస్కౌంట్‌లతో ఇది కొనుగోలుదారులకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.