సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నిన్నగాక మొన్న 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటిందని అనుకున్నాం, కానీ అప్పుడే ఈ చిత్రం 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి చేరువ అయ్యిందని మేకర్స్ కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ని విడుదల చేసారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 198 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు తప్ప, ఒక ప్రాంతీయ బాషా చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు రాలేదట. ప్రాంతీయ బాషా చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురంలో’. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది.
ఫుల్ రన్ లో కచ్చితంగా ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేసి, ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. 15వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈమధ్య ఇంత కలెక్షన్స్ రావడం లేదు. ఇదే తరహాలో ఊపు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ‘దేవర’, ‘సలార్’ వంటి పాన్ ఇండియన్ సినిమాలను కూడా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది 10 కోట్ల రూపాయిలకు పైగానే ఉంటుందని అంచనా.
ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రోజుకి యావరేజ్ గా వర్కింగ్ డేస్ లో కూడా 40 వేల డాలర్లకు తగ్గకుండా గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ తో మూడు మిలియన్ డాలర్ల మార్కుని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఇప్పటి వరకు ‘రంగస్థలం’, ‘అలా వైకుంఠపురంలో’ , ‘భరత్ అనే నేను’ చిత్రాలు మాత్రమే మూడు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా చేరబోతోంది. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు కూడా ఇప్పటి వరకు ఓవర్సీస్ లో ఈ ఫీట్ కి చేరుకోలేదు. ఇప్పుడు వెంకటేష్ మూడు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరితే, ఆ మార్కుని అందుకున్న మొట్టమొదటి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టిస్తాడు. చూడాలిమరి ఎంత వరకు అది నిజమవుతుందో.