సంక్రాంతి సినిమాల ముందు భారీ టార్గెట్లు.. రిలీజ్‌కు ముందే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్

www.mannamweb.com


ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన సినిమాలు యావరేజ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి.
ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ మూడు సినిమాలలో గేమ్ ఛేంజర్ 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే హిట్ అనిపించుకునే ఛాన్స్ ఉంది. డాకు మహారాజ్ మూవీ టార్గెట్ 100 కోట్ల రూపాయలు కాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ టార్గెట్ 60 నుంచి 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు అని సమాచారం. నైజాంలో థియేటర్ల విషయంలో ఏ సినిమాకు అన్యాయం జరగకుండా దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మరీ భారీ టార్గెట్ లేకపోవడం, అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ లో ఉండటం, వెంకటేశ్ సరిపోయే కాన్సెప్ట్ మూవీ కావడం, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

2025 సంవత్సరం జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి కథనంతో మ్యాజిక్ చేస్తాడని ఈ డైరెక్టర్ ఖాతాలో ఎనిమిదో హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దిల్ రాజు 2025 సంక్రాంతిపై చాలా ఆశలు పెట్టుకోగా డాకు మహారాజ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే కావడం గమనార్హం. మూడు సినిమాలకు హిట్ టాక్ వస్తే దిల్ రాజు దశ తిరుగుతుందని చెప్పవచ్చు.