‘సరిపోదా శనివారం’ డే 2 కలెక్షన్లు

www.mannamweb.com


న్యాచురల్ స్టార్ నాని.. ఫీల్ గుడ్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైయ్యాడు. అయితే అప్పడుప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అందులో భాగంగానే ‘దసరా’ లాంటి రా అండ్ రస్టిక్ మూవీలో నటించి తనలో యాక్షన్ మోడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో తనలో ఉన్న మాస్ హీరోని మరోసారి ఆడియెన్స్ కు చూపించాడు. ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. మరి రెండో రోజు ఆ జోరును నాని కొనసాగించాడా? సెకండ్ డే ఎంత రాబట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సరిపోదా శనివారం మూవీ తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీకి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. నాని, ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే జేక్స్ బిజోయ్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. దాంతో తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాడు నాని. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 24 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం ఈ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. సెకండ్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్ల నుంచి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక ఏరియాల వైజ్ గా చూస్తే.. నైజం రూ. 1.25 కోట్లు, కృష్ణ – 16.21 లక్షలు, వెస్ట్ గోదావరి – 10.28 లక్షలు, ఈస్ట్ – 11 లక్షలు, సీడెడ్ లో రూ. 40 లక్షలు రాబట్టింది(రెండు రోజుల్లో కోటి). కాగా.. వరల్డ్ వైడ్ గా 4.6 నుంచి 5 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ముందు వీకెండ్ ఉండటంతో.. వసూళ్లు కచ్చితంగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన నాని.. ఈ వీకెండ్ లోనే దాన్ని అందుకునేలా కనిపిస్తున్నాడు.