ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలో రోజురోజుకీ సైబర్ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాలను హ్యాక్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.
నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్‌బీఐ పేరితో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం జారీ చేసిన సలహాలో పేర్కొంది. గత కొన్ని రోజుల నుంచి రివార్డ్ పాయింట్ల పేరుతో ఓ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ పేరుతో రివార్డులను క్లైమ్ చేసుకోవాలంటూ కొందరు సైబర్ నేరస్థులు నకిలీ మెసేజ్‌లను సర్క్కూలేట్ చేశారు. వీటిని ఓపెన్ చేసి, వ్యక్తిగత వివరాలు అందజేసి మోసపోయి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఈమెయిల్స్, మెసేజ్‌లతో పాటు సోషల్ మీడియాలో రివార్డ్స్ పాయింట్స్ పేరిట వస్తున్న ఫ్రాడ్ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ పేరుతో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ ప్రకారం రూ. 9980 విలువైన పాయింట్లను రీడిమ్ చేసుకోవాలని సందేశంలో పేర్కొంటున్నారు. అయితే ఈ పాయింట్స్‌ను రీడిమ్ చేసుకోవాలంటే ఒక ఏపీకే ఫైల్‌ను డౌనల్‌లోడ్ చేసుకోవాలని సూచిసత్ఉన్నారు. అయితే ఈ ఏపీకే ఫైల్‌ను పొరపాటున డౌన్‌లోడ్ చేశారో ఇక మీ ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. దీంతో ఈ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి.
దీంతో మీ ఓటీపీలను సైబర్ నేరస్థులు యాక్సెస్ చేస్తారు. వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. చూశారుగా ఉచితంగా రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయని క్లిక్ చేశారో ఇక మీ పని అంతే అవుతుంది. రివార్డ్ పాయింట్లకు సంబంధించి ఎస్‌బీఐ అధికారిక యాప్‌నే విశ్వసించాలి.