SBI Jobs: ఎస్‌బీఐలో రాత పరీక్ష లేకుండానే జాబ్స్.. అప్లై చేసుకోవడానికి 2 రోజులే ఛాన్స్ !

SBI SO Recruitment 2024: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II, మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ కింద 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యెమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 750 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: రూ. 48,170- 69,810.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27.2024.