ప్రస్తుతం జనాలను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో మూవీస్ ఒకటి. వారం వారం..థియేటర్లలో, ఓటీటీలో చాలా సినిమాలు విడుదలై సందడి చేస్తుంటాయి. అన్ని జోనర్ల మూవీస్ థియేటర్లలో, ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇదే సమయంలో చాలా మంది హరర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అవి ఎంత భయపెడుతున్న తిరిగి అలాంటి సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో కొన్ని హరర్ మూవీస్ భయపెడుతూనే..కడుబ్బా నవ్విస్తున్నాయి. అలాంటి ఓ సినిమా ఓటీటీలో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఆ మూవీ చేసుకుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మరి.. ఆ సినిమా ఏమిటి, ఎందురు స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం..
ప్రతి వారం ఓటీటీలో అనేక సినిమాలు రిలీజ్ అవుతాయి. కొన్ని మూవీలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని హారర్ తో వణుకు పుట్టిస్తాయి. కాకుడ అనే బాలీవుడ్ మూవీ మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తూనే నవ్విస్తోంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించిన ‘కాకుడ’ జులై 12న ఓటీటీలోకి విడుదలైంది. అయితే అలా ఓటీటీలోకి వచ్చిన మూడు రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ విషయాన్నిజీ5 సంస్థతో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేసింది. ‘చిల్లింగ్ వీకెండ్లో..చిల్లింగ్ టేకోవర్’ అంటూ జీ5 పోస్టుచ సింది. ఈ హరర్ మూవీలో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్, ఆసిఫ్ ఖాన్, సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీమ్ కీలక పాత్రలో నటించారు. ఇక హరర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన కాకుడ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ఈ సినిమా కథ చాలా వెరైటీగా ఉంది. ప్రతి క్షణం ఉత్కంఠ భరింతంగా సాగుతోంది.
ఇక కాకుడ కథ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలో రథోడి అనే ఊరు శాపగ్రమై ఉంటుంది. అలానే ఆ గ్రామంలోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు దెయ్యం వస్తుంది. ఆ గ్రామంలోని వారు ఆ దెయ్యాని కాకుడ అనే బూతంగా చూస్తారు. అలానే ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు ప్రతి ఇంటికి ఉండే ఓ చిన్న తలుపును ఓపెన్ చేసి ఉంచాల్సిందే. అలా ఎవరైన తెరవకుండా ఉంటే.. వారిని 13 రోజుల టైమ్ ఇచ్చి మరీ ఆ ఇంటి మనిషిని కాకుడ దెయ్యం చంపేస్తుంది. ఈ విషయం తెలియని సోనాక్షి భర్త ఆ చిన్న డోరును తెరిచి ఉంచడు. దీంతో అతడు కాకుడ దెయ్యానికి దొరికిపోతాడు.
ఇక రోజు ఆ దెయ్యం వస్తుందని..చంపేస్తుందని భయంతో వణికిపోతుంటాడు. ఇదే సమయంలో దెయ్యాలను వేటాడే వ్యక్తిగా (రితేష్ దేశ్‌ముఖ్) ఆ గ్రామంలోకి వెళ్తాడు. దెయ్యాలు, భూతాలు ఏమిలేవని, అదంతా మూఢనమ్మకమంటూను ధైర్యం చెబుతుంటాడు. ఇదే సమయంలో ఆ దెయ్యం అంతు చూడాలని రితేష్ నిర్ణయించుకుంటాడు. చివరికి వారిద్దరూ కలిసి ఆ కాకుదాను పట్టుకుంటారా? ఆ గ్రామం వాళ్లను ఎలా కాపాడతారు అన్నదే సినిమా స్టోరీ. ఎవరైనా ఈ సినిమాను చూడటం మిస్సై ఉంటే తప్పకుండా చూడండి.