డ్రైవర్లు, మెకానిక్‌ల పిల్లలకు గుడ్ న్యూస్.. రూ.12 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్

www.mannamweb.com


సరస్వతీ బిడ్డలకు ఆర్థిక కష్టాలు.. పేదరికంతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులు అనే వార్తలు వింటూఉంటాం. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా చదువుకు నోచుకోని వారెందరో ఉన్నారు. సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. వారికి ప్రాథమిక విద్యను అందించగలుగుతున్నారు కానీ, ఉన్నత చదువులకు పంపలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ పిల్లల్లో ఎవరినో ఒకరిని మాత్రమే చదివించగలుగుతున్నారు.

డబ్బులేని కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. అయితే విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ఆర్థిక చేయూతనందిస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ను అందిస్తున్నాయి. ఇదే సమయంలో పలు కార్పోరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ ను అందిస్తున్నాయి. ఈ క్రమంలో వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ విద్యార్థులకు తీపికబురును అందించింది. స్టూడెంట్స్ కు 12 వేల స్కాలర్ షిప్ ను అందించేందుకు రెడీ అయ్యింది. వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్-2024 ద్వారా ఉపకార వేతనాలను అందిస్తుంది.

కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు, మెకానిక్‌ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన విద్యార్థులకు స్కాలర్ ఫిష్ అందిస్తుంది. వాల్వోలిన్ ముస్కాన్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ పేరిట 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ ను పొందొచ్చు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ను దక్షిణ భారతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రూ.12,000 వరకు గ్రాంట్‌ను అందిస్తారు. ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు ఎవరంటే.. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్‌షిప్‌ నకు అర్హులు. కమర్షియల్ వెహికల్ డ్రైవర్ల పిల్లలు, మెకానిక్స్ పిల్లలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు మునుపటి తరగతిలో 60%, అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం muskaan.valvolinecummins.comను సందర్శించాల్సి ఉంటుంది.