ఈ నెల 13న పాఠశాలల పునఃప్రారంభం

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13న పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13న పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీనే పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా.. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు సంఘాలు కోరాయి. దీంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.