Seeds for Brain: ఈ గింజలు రోజూ తీసుకుంటే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పని చేస్తుంది..

www.mannamweb.com


మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏ పని అయినా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీగా ఉండే ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉండాలి. శరీరానికి సరైన పోషకాలు అందిస్తే.. అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా మంది ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్‌కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల బ్రెయిన్ కూడా సరిగా పని చేయదు. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అల్జీమర్స్ కారణంగా మతిమరుపు ఎక్కువై..

మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏ పని అయినా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీగా ఉండే ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉండాలి. శరీరానికి సరైన పోషకాలు అందిస్తే.. అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా మంది ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్‌కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల బ్రెయిన్ కూడా సరిగా పని చేయదు. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అల్జీమర్స్ కారణంగా మతిమరుపు ఎక్కువై ఏమీ గుర్తుండవు. మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి మెదడును ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మెదడు మొద్దు బారిపోకుండా.. యాక్టీవ్‌గా ఉంటుంది. బ్రెయిన్‌ని యాక్టీవ్‌గా ఉంచడంలో ఇప్పుడు చెప్పే సీడ్స్ ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలు:
అవిసె గింజల గురించి ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రతి రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మొత్తం శారీరాన్ని ఆరోగ్యంగా ఉంచగల శక్తి వీటికి ఉన్నాయి. అంతేకాకుండా అవిసె గింజలు తీసుకుంటే.. మెదడు కూడా యాక్టివ్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మెదడును ప్రశాంతంగా ఉంచగలం. మెదడులోని కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.

చియా సీడ్స్:
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చియా సీడ్స్ కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిలోనూ అనేక రకాలైన పోషకాలు, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. మతి మరుపు దరి చేరకుండా ఉంటుంది. అన్ని విషయాలు గుర్తు పెట్టుకోగలరు.

గుమ్మడికాయ గింజలు:
మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడి కాయ గింజలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. మెదడులోని కణాలు డ్యామేజ్ కాకుండా, తిరిగి పనిచేయడంలో ఇవి చక్కగా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు బ్రెయిన్‌ని యాక్టివ్ గా చేస్తాయి.

నువ్వులు:
నువ్వులను మీ డైట్‌లో చేర్చుకోవడంలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. ఎముకలు, కండరాలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా మెదడుకు అవసరమైన పోషకాలను అందించి.. ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొద్దు తిరుగుడు గింజలు:
సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా బ్రెయిన్‌ హెల్త్‌ని కాపాడటంలో సహాయ పడతాయి. మెదడులో సెల్స్ డ్యామేజ్ కాకుండా, మంట, వాపులను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మెదడును చురుకుగా ఉంచుతుంది.