ఆ జబ్బులతో బాధ పడేవారికి దివ్యౌషధంగా సీమ చింతకాయ.. దీని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

ఆ జబ్బులతో బాధ పడేవారికి దివ్యౌషధంగా సీమ చింతకాయ.. దీని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!


సీజనల్లీ మార్కెట్‌లోకి వచ్చే ఫ్రూట్స్‌తో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో సీమ చింతకాయలు ఒకటి. దీనిని గుబ్బ కాయలు అని కూడా పిలుస్తారు.

ఇవి గతంలో పల్లెటూరిలో రోడ్లు పక్కన, చెరువు గట్లు ఎక్కడపడితే అక్కడే ఉండేవి. కానీ, అప్పుడు ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు వీటి డిమాంగ్ భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే.. సీమ చింతకాయలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇందులో పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండే ఈ ఫ్రూట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి1, బి2, బి6, ఏ, సి విటమిన్స్ పుష్కలంగా ఉండటంతో పాటు.. ఖనిజ లవణాలు కూడా ఎక్కువే. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్-సి సమృద్ధిగా ఉన్నందువల్ల సీమ చింతకాయ తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇందులో ఫైబర్‌తో పాటు.. విటమిన్ సి, ఎ, పొటాషియం, ఐరన్ లాంటి అనేక విటమిన్లు, మినరల్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి శరీరానికి కవాల్సిన శక్తిని అందిస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో ఉన్నాయి. సీమ చింతకాయ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, థైమిన్ కూడా మెండుగా ఉండటంతో.. ఇది ఎముకలను మరింత దృడంగా మారుస్తాయని చెబుతున్నారు నిపుణులు.