ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

www.mannamweb.com


AP News:ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇటీవల ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు తెలిపారు.

అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాదు బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమవుతుందని, ప్రస్తుతం డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని పేర్కొన్నారు. కొత్త మంత్రులు తమ శాఖలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, లోటు బడ్జెట్ ఉందని గ్రహించి పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు.