మీకు తెలంగాణలో ఏదైనా వెహికల్ ఉందా? అయితే ఈ సమాచారం మీ కోసమే. మీ వెహికల్ 1 ఏప్రిల్ 2019 కంటే ముందు రిజిస్టర్ అయినట్లయితే, మీ నెంబర్ ప్లేట్ వెంటనే మార్చుకోవాలి.
ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు మీరు ఖచ్చితంగా High Security Registration Plate అనగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోవాల్సిందే.
ఒకవేళ సెప్టెంబర్ 30 తర్వాత మీరు కనుక పాత నెంబర్ ప్లేట్స్ తో రోడ్డు మీద తిరిగినట్లయితే కచ్చితంగా పోలీసులు ఆపేసి ఫైన్స్ వేస్తారు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది. 30 సెప్టెంబర్ లోపు ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ కి ఎలా అప్లై చేయాలి మా ఇంటికి ఆటోమేటిక్ గా వస్తాయా ఎస్ మీ ఇంటికే వస్తాయి. దానికోసం మీరు ఏం చేయాలంటే Google ఓపెన్ చేసి బుక్ మై హెచ్ఎస్ఆర్ అని చెప్పి టైప్ చేయండి.
Book HSRP Number Plate వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెహికల్ సమాచారాన్ని ఎంటర్ చేయండి. కార్ అయితే కార, బైక్ అయితే బైక్, లారీ అయితే లారీ ఏదైనా సరే ఎంటర్ చేయండి. ఇక్కడ రూ. 125 మనం కట్టి మన అడ్రెస్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రెస్ ఇవ్వగానే ఇంటికి పంపిస్తారు. ఈ విధంగా మన నెంబర్ ప్లేట్స్ ని మార్చుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అన్ని నెంబర్ ప్లేట్లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 30వ తేదీలోగా నెంబర్ ప్లేట్లను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. పైన పేర్కొన్నటువంటి సమాచారం ఆధారంగా మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఈ నెంబర్ ప్లేట్లను అప్లై చేసుకోవచ్చు. . మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే గడువు ముగిసేలోగా వెంటనే అప్లై చేసుకోండి. నిర్ణీత తేదీలోగా నెంబర్ ప్లేట్ అప్లై చేయకపోతే, ట్రాఫిక్ పోలీసులు చలానా వేసే అవకాశం ఉంది.
































