ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయ. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 5 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. థ్రిల్లర్స్ అయిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్, హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో అన్నీ థ్రిల్లర్స్ ఉండటం విశేషం. క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేటివ్ ఇలాంటి అంశాలతో థ్రిల్లర్ జోనర్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.


నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

హిజ్ అండ్ హర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 8

ది రూకీ (అమెరికన్ పోలీస్ పొసిజరల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 8

సన్ నెక్ట్స్ ఓటీటీ

సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (తెలుగు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 8

రాధేయ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 8

వెపన్స్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 8

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (తెలుగు మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 8

ఛల్లా మడ్ కే నహీ ఆయా (పంజాబీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- జనవరి 8

ఓటీటీలోకి ఇవాళ 7

ఇలా ఇవాళ (జనవరి 8) 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో కానిస్టేబుల్ కనకం సీజన్ 2, వెపన్స్, హిజ్ అండ్ హర్, సైలెంట్ స్క్రీమ్స్‌, రాధేయతో కలిపి ఐదు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

కానిస్టేబుల్ కనకం సీజన్ 2

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్ కనకం’. ఈ సిరీస్ రెండో సీజన్‌లో అడవిగుట్ట అడవుల్లో తప్పిపోయిన అమ్మాయిల మిస్టరీని కనకం ఎలా ఛేదించిందనేది ఈ సీజన్‌లో మరింత ఉత్కంఠభరితంగా చూపించారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రాధేయ (కన్నడ/తెలుగు)

కృష్ణ అజయ్ రావు నటించిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాధేయ’. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ కథలో సైకలాజికల్ అంశాలు హైలైట్‌గా నిలుస్తాయి. కిల్లర్ మనస్తత్వం, అతను చేసిన హత్యల వెనుక ఉన్న కారణాలను దర్శకుడు వేదగురు మూర్తి ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు.

వెపన్స్

హాలీవుడ్ హారర్ ప్రియులు ఎంతో ఎదురుచూస్తున్న మూవీ ‘వెపన్స్’. ఒక చిన్న పట్టణంలో 17 మంది పిల్లలు ఒకే రాత్రి అదృశ్యమవ్వడం వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ ఏమిటనేది ఈ సినిమా కథ. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.

హిజ్ అండ్ హర్స్

నెట్‌ఫ్లిక్స్‌లో నేడు విడుదలైన మరో క్రేజీ సిరీస్ ‘హిజ్ అండ్ హర్స్’. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ ఆరు ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది. అల్యూస్ ఫీనీ నవల ఆధారంగా రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగులో అందుబాటులో ఉంది.

సైలెంట్ స్క్రీమ్స్

ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా తెలంగాణలో చోటుచేసుకున్న యదార్థ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అదృశ్యమైన మహిళల కేసులు, ఆ తర్వాత బయటపడిన విస్తుపోయే నిజాలు, బాధితుల కుటుంబాల ఆవేదనను ఇందులో ఎంతో భావోద్వేగంగా చూపించారు. కేవలం నేరాలను వివరించడమే కాకుండా, మన చుట్టూ ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులపై ఇది అవగాహన కల్పిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.