దర్శకుడుశంకర్తెరకెక్కించినఇండియన్ 2, గేమ్ ఛేంజర్రెండుచిత్రాలుభారీడిజాస్టర్లుగా ముగిశాయి. దీంతోఈచిత్రాలకు సంబంధం ఉన్న వారందరికీ భారీ నష్టాలు వచ్చాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు శంకర్ ఈ రెండు చిత్రాల ఫలితం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా మందినెటిజన్లుకూడాఈవైఫల్యాలకుశంకర్ బాధ్యత వహించాలని భావించారు.కానీ, ఆయనఎక్కడాకూడాఇంతవరకునోరెత్తలేదు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజువంటిఇతరసినీప్రముఖులుపరోక్షంగాదర్శకుడుశంకర్నుతప్పుబట్టారు. పేలవమైన అవుట్‌పుట్తోపాటుశంకర్లోసరైనప్లానింగ్లేకపోవడంవల్లఎక్కువనష్టపోయినట్లుచెప్పారు. అలాంటివ్యాఖ్యలువైరల్కావడంతోఅతనిపైమరింతట్రోలింగ్పెరిగింది. అయితే, ఆయనతాజాగామరోసినిమాగురించిమాట్లాడిఅందరినీఆశ్చర్యపరిచారు.
శంకర్తన తదుపరిచిత్రంతమిళ ఎపిక్ నవల ‘వెల్పరి’ ఆధారంగా తెరకెక్కిస్తాననిచెప్పారు. అయితే, వరుసగారెండుభారీచిత్రాలతోఆర్థిక నష్టాలనుమిగిల్చినఆయనతోమరోసినిమాచేసేందుకుఎవరుముందుకువస్తారనిఅందరూఆలోచించారు. తాజాగాజరిగినఒక కార్యక్రమంలో ‘వెల్పరి’ సినిమా గురించి శంకర్మాట్లాడారు. కొద్దిసేపటికేఅవి ట్రోల్‌కావడంజరిగింది. దర్శకుడుశంకర్ మాట్లాడుతూ.. ‘ రోబోసినిమా నా మునుపటి కలల ప్రాజెక్ట్. ఇప్పుడు, ‘వెల్పరి’కూడా నా కలల చిత్రం.హాలీవుడ్చిత్రాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి కొత్త టెక్నాలజీలనుభారతీయసినిమాలకు పరిచయం చేసే అవకాశం దీనికి ఉంది. ‘వెల్పరి’ప్రాజెక్ట్ తమిళ సినిమాతోపాటు భారతీయ సినిమాకు గర్వకారణంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రపంచ గుర్తింపును పొందగలదు. కల నిజమవుతుందని ఆశిస్తున్నాను.’ అనిఆయనఅన్నారు.
అయితే, శంకర్మాటలపైట్రోల్స్కూడావస్తున్నాయి.ఒకప్పుడు దూరదృష్టి గల దర్శకుడిగా ఉన్నప్పటికీ, శంకర్ ఇప్పుడు వాస్తవికతకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడనిచెబుతున్నారు. ఇండియన్2, గేమ్ఛేంజర్సినిమాలనుచూస్తేగతంలోఅనేకఐకానిక్చిత్రాలనుఅందించినదర్శకుడుఇతనేనాఅనేసందేహంవస్తుంది. కోట్లనష్టాలనుమిగిల్చినఆయనతోసినిమాచేసేందుకునిర్మాతలుముందుకువస్తారా..? హీరోలుశంకర్కుఛాన్స్లుఇస్తారా..? అనేకామెంట్లుచేస్తున్నారు.
శంకర్ఇకనుంచైనా పాటల కోసం అధికంగా ఖర్చు చేయడంమానేసి.. కథ, స్క్రీన్‌ప్లేపై ఎక్కువ దృష్టి పెట్టాలని చాలామంది సూచిస్తున్నారు.గేమ్ ఛేంజర్ , ఇండియన్ 2సినిమాలవల్ల కమల్ హాసన్తోపాటురామ్ చరణ్ వంటి స్టార్ల ఖ్యాతి కూడా తీవ్రంగా దెబ్బతింది.అలాంటప్పుడు భారీ ఖర్చుతో కూడిన వల్పరి వంటి ప్రాజెక్ట్‌కు ఖచ్చితంగా ఒక స్టార్ హీరో అవసరం. కానీ శంకర్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే, ఏ అగ్ర నటుడు అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడో లేదో చూడాలి.
హీరో, నిర్మాతలు
‘వెల్పరి’ సినిమాకోసంకన్నడస్టార్యశ్నుశంకర్సంప్రదించారనితెలుస్తోంది. సుమారురూ. 1000 కోట్లబడ్జెట్తోఈచిత్రంఉంటుందనిటాక్వైరల్అవుతుంది. అత్యంతఖర్చుతోకూడుకున్నఈచిత్రాన్నికరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా సంస్థలు కలిసి నిర్మించే ఛాన్స్ఉన్నట్లుతెలుస్తోంది. సు.వెంకటేశన్ రాసిన ‘వెల్పరి’ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది.అత్యంతప్రజాదరణపొందిననవలగాగుర్తింపుపొందింది. అందుకేశంకర్ఈచిత్రంపైప్లాన్చేస్తున్నారు.
































