ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో నిలబడి ప్రధాని మోదీ చెప్పారని.. ఆయన ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే.. పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. పోటీ పడి మరీ ఏపీకి పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్‌లో 2 వేల పరిశ్రమలు వచ్చాయని.. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చినట్లు గుర్తు చేశారు. మరి హోదా మీద మోదీ ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని షర్మిల మోదీని ప్రశ్నించింది.