షార్లెట్ హోమ్స్ మాటల్లో చెప్పాలంటే.. ఆమె శరీరం నుంచి విడిపోయి.. పైనుంచి చూస్తూ ఉంది. (అంటే ఆత్మ లాగా అనుకోవచ్చు). డాక్టర్లు తనపై చేస్తున్న చికిత్సను ఆమె స్పష్టంగా గమనించిందట. అప్పుడు భర్త డానీ గది మూలన నిలబడి ఉన్నాడు. నర్సులు చుట్టూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆమెకు అద్భుతమైన పూల సుగంధం వచ్చింది. జీవితంలో ఎప్పుడూ వాసన చూడని అందమైన, మరచిపోలేని సుగంధం అది. అదే సమయంలో సంగీతం వినిపించింది. కళ్లు మూసి, తెరిచినప్పుడు స్వర్గంలో ఉన్నట్లు ఆమెకు అనిపించింది. అక్కడ ఏ భయమూ లేదు, పూర్తి ఆనందం మాత్రమే. చెట్లు, గడ్డి, ప్రకృతి అంతా సంగీతంతో కలిసి దేవుని స్తుతిస్తున్నట్లు కనిపించాయట.
అయితే ఆ అనుభవం అంతా స్వర్గంతోనే ముగియలేదు. దేవుడు ఆమెను నరకం అంచుకి తీసుకెళ్లాడట. అక్కడ కంపు కొట్టే దుర్వాసన. అంటే.. కుళ్లిన మాంసం వాసన వచ్చిందట. అరుపులు, బాధలు చూసింది. స్వర్గ సౌందర్యానికి పూర్తి వ్యతిరేకంగా నరకం ఉందట. “స్వర్గ సౌందర్యం చూసిన తర్వాత నరకం చూడటం భరించలేనిది” అని ఆమె చెప్పింది. దేవుడు ఇలా చూపించడానికి కారణం ఉందని చెప్పింది. కొందరు తమ మార్గాలు మార్చుకోకపోతే అక్కడికే వెళ్తారని హెచ్చరికగా చూపించారని ఆమె అంది.
ఈ కథ 2019 నాటిదైనప్పటికీ, 2025 చివర్లో మళ్లీ వైరల్ అవుతోంది. అనేక వార్తా సంస్థలు దీన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి. మరణానంతర జీవితం గురించి ఆసక్తి ఉన్నవారికి ఇది ఆశను, హెచ్చరికను ఇస్తోంది. షార్లెట్ 2023లో మరణించినా, ఆమె కథ ఇప్పటికీ ప్రజలను ఆలోచింపజేస్తోంది. స్వర్గం నిజమేననీ, అక్కడ భయం లేదని ఆమె ధైర్యంగా చెప్పింది. ఈ అనుభవం మరణం గురించి కొత్త చర్చను రేకెత్తిస్తోంది. శాస్త్రీయంగా వివరించలేని ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌లు నిజమైనవా? లేక మెదడు హాలుసినేషన్సా? అనేది ప్రస్తుతానికి మిస్టరీయే. అయినా, షార్లెట్ కథ మిలియన్ల మందికి ఆశనూ, ఆలోచననూ ఇస్తోంది.

































