సైంటిస్టులకే సవాల్.. 3 వేల ఏళ్ల నుంచి మిస్టరీగా శివాలయం..

ఈసృష్టిలో అత్యంత పురాతనమైన మతం అంటే హిందూ మతం. ఈ హిందూ మతం కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. వేరే దేశాల్లో కూడా వేల ఏళ్ల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి.


ఆ పురాతన దేవాలయాల్లో చాలా వరకు మిస్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఆ గుళ్ల నిర్మాణం దగ్గరినుంచి మొదలుకుని లోపల ఉన్న దేవుడి విగ్రహాల వరకు అంతా మిస్టరీగా అనిపిస్తుంది. ఇక, కేరళలోని 3 వేల ఏళ్లనాటి పురాతన శివుడి గుడి ఓ పేద్ద మిస్టరీగా మారింది. ఆ మిస్టరీని సైంటిస్టులు సైతం ఛేదించలేకపోతున్నారు. ఇంతకీ ఏంటా మిస్టరీ అంటే.. కేరళలోని పుత్తుర్ గ్రామంలో నీర్ పుతూర్ మహదేవ్ గుడి ఉంది. ఈ గుడిని నిర్మించి దాదాపు 3 వేల ఏళ్లు అవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇందులో మిస్టరీ ఏంటంటే..

గుడిలోని శివలింగం. ఆ శివలింగాన్ని మనుషులు తయారు చేయలేదు. దానంతట అదే స్వయంగా వెలసిందట. ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించారు.. ఎప్పుడు ప్రతిష్టించారు అన్నది ఎవరికీ తెలీదు. ఈ శివలింగం మాత్రమే కాదు.. అందులోని నీళ్లు కూడా ఓ మిస్టరీనే. శివలింగం చుట్టూ ఉండే నీరు.. సంవత్సరంలోని అన్ని రోజులు అలాగే ఉంటాయి. ఎండలు ఎంత భీకరంగా ఉన్నా.. నీళ్లు మాత్రం ఇంకిపోవు. నీళ్లు ఇలా ఏడాది పొడువునా ఉండటం జియాలజిస్టులనే ఆశ్చర్యపరుస్తోంది. ఆ నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలీదు. ఇక్కడి నీళ్లకు రోగాలను నయం చేసే గుణం ఉందని భక్తులు నమ్ముతున్నారు. ఆ నీటిలో ఉండే మినరల్స్ కారణంగా రోగాలు ఇట్టే నయం అవుతాయట.

సైంటిస్టులకు సవాల్

నీర్ పుతూర్ మహదేవ్ గుడి గురించి తెలుసుకోవడానికి, అక్కడి మిస్టరీల గుట్టు విప్పడానికి సైంటిస్టులు చాలా ప్రయాసపడుతున్నారు. గుడిపై చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా గుడిలోని మిస్టరీలు కొలిక్కి రావటం లేదు. సైంటిస్టులే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి టెక్నాలజీ కూడా వాటి గుట్టు విప్పలేకపోతోంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. సైంటిస్టులు గర్భగుడిలోకి వెళ్లినపుడు ఏదో తెలియని శక్తిని ఫీలయ్యారట. మీరు గనుక ఈ మిస్టరీ గుడికి వెళ్లాలనుకుంటే.. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లాలనుకునే వారు.. కాలికట్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి. అక్కడినుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది. రైలులో వెళ్లాలనుకుంటే.. తిరుర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి కూడా గుడి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులో వెళ్లాలనుకుంటే.. పెరింతల్‌మన్న నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది.