Shocking: వామ్మో.. ఇది చూస్తే ఇంకెప్పుడూ ఐస్ క్రీమ్ తినాలనుకోరు!

ఇటీవల కాలంలో బయట తినాలంటే జనాలు భయపడిపోతున్నారు. నాణ్యత లేని పదార్థాలు వాడుతున్నారని, పరిశుభ్రత పాటించటం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడటంతో అవుట్ సైడ్ ఫుడ్‌కి జనాలు నో అంటున్నారు.


అంతేకాదు, పలు సందర్భాల్లో ఆహారంలో బొద్దింకలు, పురుగులు, చనిపోయిన కప్పలు, ఇతర జీవుల అవశేషాలు బయటపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ప్రజలు బైటకు వెళ్లి తినేందుకు ఇష్టపడటం లేదు. ఇక చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్‌కు సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూస్తే.. ఇంకెప్పుడూ ఐస్ క్రీమ్ తినాలని అనుకోరు.

థాయిలాండ్‌లోని (Thailand) ముయాంగ్ రాట్చబురి ప్రాంతానికి చెందిన రెబాన్ నక్లియాంగ్‌బూన్ (Reban Naklyangboon) అనే యువకుడు రోడ్డు పక్కన ఉన్న బండిలో ఐస్ క్రీమ్ కొన్నాడు. కవర్ తీసేసి.. పుల్ల ఐస్ క్రీమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. ఇంతలో అతనికి భయానక ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్‌లో ఏదో ఉన్నట్లు కనిపించటంతో గమనించి చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ పుల్ల ఐస్ మొత్తానికి గట్టి కట్టి చనిపోయిన పాము అవశేషం ఉంది. వెంటనే దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అతడు పోస్ట్ చేసిన ఫోటోలో నలుపు, పసుపు రంగులో పాము తల స్పష్టంగా కనిపించింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.