ఫోన్ వాడకం నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు పెద్ద, చిన్న అన్ని రకాల పనులను దానిపైనే చేస్తున్నారు. ఫోన్ కొత్తది అయితే చాలా సరదాగా ఉంటుంది, కానీ అది పాతబడటం మొదలయ్యే కొద్దీ అందులో రకరకాల సమస్యలు మొదలవుతాయి.
చాలా సార్లు, ఫోన్ ల్యాగ్ అవ్వడం వల్ల ఫోన్‌లో కొత్త సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో మనం వెంటనే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తాము. తద్వారా మనం దాన్ని మళ్లీ ఆన్ చేసినప్పుడు, ఫోన్ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఫోన్‌లో పవర్ ఆఫ్, రీస్టార్ట్ ఆప్షన్‌లు రెండూ ఉంటాయి.
అయితే ప్రతీసారి మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల మెమరీ లీక్‌లను నివారించడంలో కూడా సహాయపడుతుంది. బ్యాటరీస్ ప్లస్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ఒక యాప్ పనిచేయడానికి పెద్ద మొత్తంలో మెమరీ అవసరమైనప్పుడు మెమరీ లీక్‌లు వస్తాయట. అయితే యాప్ ఉపయోగంలో లేనప్పుడు మెమరీ ఖాళీ అవ్వదు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రిస్టార్ట్ చేయడం మంచిదని చెబుతున్నారు.
అయితే మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల కనెక్టివిటీ సమస్యలు రావోచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌లు కొన్నిసార్లు డేటా, Wi-Fiకి కనెక్ట్ కాలేవు, ఫోన్‌ని పునఃప్రారంభించిన తర్వాత మళ్లీ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక మీ ఫోన్‌ని పవర్ ఆఫ్ చేయడం వల్ల దాని కాచే డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో మీ ఫోన్ మరింత సమర్థవంతంగా పని చేస్తుంది.
ఫోన్‌ను షట్ డౌన్ చేయడం, రీస్టార్ట్ చేయడం కాకుండా, మీరు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను క్లియర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరి మరింత కాలం ఉంటుంది.
ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం అనేది సాధారణంగా ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు, లేదా యాప్‌లు సరిగ్గా రన్ కానప్పుడు, సాఫ్ట్‌వేర్ లోపాలు ఏర్పడినప్పుడు చేయాలి. ఇలా ఫోన్ సరిగ్గా పనిచేయడంలో తొడ్పాటును ఇస్తుంది. ఇది మంచి పద్ధతి కూడా, దీని కారణంగా ఫోన్ సాఫీగా నడుస్తుంది.