పిల్లల చదువులపై పొదుపు చేయాలా..? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!

పిల్లల చదువులు ఈరోజుల్లో చాలా ఖరీదు అయిపోయాయి. ఎల్‌కేజీ, యూకేజీలకు వేలకు వేలకు తీసుకుంటున్నారు. మనం ఇంకా హైలెవల్‌ మోడ్రన్‌ స్కూల్‌లో జాయిన్ చేపిస్తే లక్ష పట్టుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో పిల్లల ఉన్నత చదువులపై ముందు నుంచే పొదుపు చేయాలి. ఇందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయడం బెస్ట్ ఆప్షన్. హోమ్‌లోన్‌ లేదా ఇతర బాధ్యతలు ఉన్నా సరే, సరైన ప్రణాళికతో పిల్లల ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా సిప్‌ చేయడం కష్టమేమీ కాదు. ఈరోజు మనం ఈ అంశంపై మరింత క్లుప్తంగా తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, ఆర్థిక లక్ష్యాలను అంచనా వేయాలి. బిడ్డకు ప్రస్తుతం ఐదు సంవత్సరాలు అనుకుంటే, దాదాపు 13 సంవత్సరాలలో కళాశాల విద్య ప్రారంభమవుతుంది. ఏటా సుమారు 10% రేటుతో పెరుగుతున్న ఉన్నత విద్య ఖర్చును కవర్ చేయడానికి, అప్పటికి దాదాపు రూ.70 లక్షలు కావాల్సి ఉంటుంది.

లక్ష్యాల దీర్ఘకాలిక స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ మనకు బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఫండ్స్‌ అధిక వృద్ధి, రిటర్న్స్‌ అందిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ఈక్విటీ ఫండ్స్‌ సరిపోతాయి. హోమ్ లోన్ EMI వంటి ఆర్థిక బాధ్యతలు కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తు ఖర్చులపై ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించడం చాలా ముఖ్యం.

పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి, కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో SIP చేయవచ్చు. పోర్ట్‌ఫోలియోకు డైవర్సిటీ అందిస్తూ.. వివిధ రంగాలు, కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. డైవర్సిఫికేషన్‌ వల్ల నష్టాల భయం తగ్గుతుంది. ఆర్థిక లక్ష్యాలను సాధించే అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, PGIM ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వంటి వాటిని పరిశీలించండి.

13 సంవత్సరాలలో పిల్లల విద్య కోసం రూ.70 లక్షలు సంపాదించడం ఆర్థిక లక్ష్యం. దీన్ని సాధించేందుకు సెలక్టెడ్‌ ఫండ్స్‌లో నెలవారీ రూ.18,000 సిప్‌ చేయాలి. 12% యావరేజ్‌ యాన్యువల్‌ రిటర్న్స్‌ అందితే.. పెట్టుబడి మొత్తం పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు భద్రత కల్పిస్తూ కావలసిన కార్పస్‌ను అందిస్తుంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ జర్నీ ప్రారంభంలో సిప్‌ చేస్తున్న మొత్తం తక్కువగా అనిపిస్తుంది, దీనికి ఆందోళన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. నెలకు రూ.12,000తో ప్రారంభించి.. ప్రతి సంవత్సరం 10% పెంచవచ్చు. ఈ విధానం ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో స్థిరంగా పని చేస్తూనే, ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా పెట్టుబడులను అడ్జస్ట్‌ చేసుకునే ఆప్షన్‌ అందిస్తుంది. మా జీతమే 20 వేలు ఉంటుంది ఇంత ఎక్కడా పెట్టేది అంటే.. పోస్ట్‌ ఆఫీస్‌లో ఇంకా చాలా స్కీమ్స్‌ ఉన్నాయి. కేవలం 1800తో మొదలుపెడితే చాలు.. నాకు ఇంకా పెళ్లే కాలేదు కాదా ఎందుకు ఇవన్నీ అనుకుంటారేమో.. ప్లానింగ్‌ ముందు నుంచే ఉంటే బరువు తగ్గుతుంది. మనిషై పుట్టాక పెళ్లి చేసుకోక తప్పదు, పిల్లలను కనగా తప్పదు. కాబట్టి మీకు ఇప్పుడు ఒక 26, 27 సంవత్సరాలు ఉంటే.. పోస్టాఫీసులో మంచి స్కీమ్స్‌ ఉన్నాయి. నెలకు కేవలం 1855 కడితే మీకు 50 ఏళ్లు వచ్చే సరికి 10లక్షల 72 వేలు వస్తాయి. ఆ డబ్బు మీ పిల్లల చదువుకు బాగా ఉపయోగపడుతుంది. అంత కంటే ఎక్కువ కావాలి అంటే. 2500 అయినా కట్టొచ్చు. ఏది ఏమైనా ముందు అయితే మీరు ఒక అడుగు ముందుకేసి వెళ్లి తెలుసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *