తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సాయమందించిన మొదటి తమిళ హీరో.. భారీగా విరాళమిచ్చిన శింబు

www.mannamweb.com


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైపోయాయి. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఎంతో మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. వర్షాలు తెరిపినివ్వడంతో ఇప్పుడిప్పుడే వరద బాధితులు కోలుకుంటున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చారు. సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందించారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ, దగ్గుబాటి వెంకటేశ్, రానా తదితర ప్రముఖులు వరద బాధితుల కోసం విరాళాలు అందించారు. అయితే హీరోలు తప్పితే హీరోయిన్లు వరదలపై పెద్దగా స్పందించలేదు.సాధారణంగా వయనాడ్ విపత్తు సమయంలో పలువురు తెలుగు హీరోలు స్పందించి విరాళమందించారు. చిరంజీవి స్వయంగా కేరళకు వెళ్లి సీఎంకు కోటి రూపాయల చెక్ ను అందించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని వరదలపై వేరే స్టేట్స్ కు సంబంధించిన నటులు ఒక్కరు కూడా సాయమందించలేదు. వారు తెలుగు లతో కోట్లు సంపాదిస్తున్నా ఇక్కడి పరిస్థితిపై కనీసం స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా తమిళ స్టార్ హీరో శింబు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించాడు. వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీగా విరాళం ఇచ్చాడు. తద్వారా బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేసిన మొదటి నటుడిగా నిలిచాడు శింబు. శింబు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు మూడు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షలు విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శింబు తెలుగు ఫ్యాన్స్ కూడా తమ హీరోను అభినందిస్తున్నారు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న శింబుకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వల్లభ, మన్మధ తదితర లతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల అతను నటించిన మానాడు, పాతుతల లు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.