నిరుద్యోగులకు అలర్ట్.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల..

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. వివిధ కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి.


కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, రైల్వేలు, బ్యాంకులు, డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ జరుగుతోంది. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే, లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలు, అప్‌డేట్స్ చెక్ చేయండి.

* అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2024

ఇండియన్ నేవీ అగ్నివీర్ MR (మ్యూజిషియన్) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 1 నుండి ప్రారంభమవుతుంది, జులై 11 వరకు తుది గడువు ఉంది. పెళ్లికాని పురుషులు, మహిళలు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ వెబ్‌సైట్ joinindiannavy.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

* SSC CGL 2024

SSC CGL 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17,727 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తోంది. వీటికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జులై 24. SSC అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

* ICG రిక్రూట్‌మెంట్ 2024

ఇండియన్ కోస్ట్ గార్డ్ 10వ, 12వ తరగతి అర్హతతో సెయిలర్, మెకానికల్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 3లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్, కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGPT) 01/2025 బ్యాచ్ ద్వారా జరుగుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, joinindiancoastguard.cdac.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.

* రైల్వే రిక్రూట్‌మెంట్ 2024

ఈశాన్య రైల్వే ఐటీఐ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కోసం అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌ చేపట్టింది. మొత్తం 1,104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్ వంటి ట్రేడ్స్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. రైల్వే వెబ్‌సైట్లు ner.indianrailways.gov.in, apprentice.rrcner.netలో ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు జులై 11 వరకు అవకాశం ఉంది.

* AFCAT 2 2024:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ AFCAT 2 2024 కోసం అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. జూన్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లో ఖాళీగా ఉన్న 304 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.inలో అప్లై చేయవచ్చు.

* IBPS RRB 2024

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ ఆఫీసర్ స్కేల్ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ ప్రకటించింది. దేశంలోని 100కి పైగా గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 9,995 క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్), PO (ఆఫీసర్ స్కేల్-I) పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in లో ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్‌మిట్ చేయవచ్చు.