సాధారణంగా 65 ఇంచెస్‌తో కూడిన టీవీని కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కువ రూ. లక్ష ఖర్చు చేయాల్సిందే. అయితే తాజాగా ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో 65 ఇంచెస్ టీవీని రూ. 45 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ ఏంటా స్మార్ట్ టీవీ.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా తర్వాత ఇంట్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య పెరిగింది. దీంతో పెద్ద పెద్ద స్క్రీన్‌లతో కూడిన టీవీలను కొనుగోలు చేసే వారి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే బిగ్ స్క్రీన్ టీవీలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిందే. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఓ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ ఏంటా టీవీ.? అందులో ఉన్న ఫీచర్లు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీసీఎల్ కంపెనీకి చెందిన 65 ఇంచెస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 1,24,990 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో ఏకంగా 62 శాతం డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 46,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 45వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందన్నదానిపై క్లారిటీ లేదు.
ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే టీసీఎల్ టీవీలో 65 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లేజ్‌లెస్ స్క్రీన్‌ను అందించారు. దీంతో స్క్రీన్ సైజ్ పెద్దగా కనిపిస్తుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఈ టీవీ సొంతం. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్ వస్తోంది. ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ని అందించారు. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. గూగుల్ అసిస్టెంట్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.
అలాగే ఇందులో స్క్రీన్ మిర్రరింగ్, మల్టీపుల్ ఐ కేర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌ను అందించారు. ఇథర్ నెట్, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ టీవీలో 24 వాట్స్ డాల్బీ ఆడియో ఎమ్‌ఎస్12వై డాల్బీ ఆడియోను అందించారు. టీవీపై 2 రెండేళ్ల వారంటీని అందిస్తున్నారు.