సిగరెట్,బీడీ ముడితే కాలుడే…పొగరాయుళ్ళకు బ్యాడ్ న్యూస్…

మీకు సిగరెట్, పాన్ మసాలా అలవాటుందా? అయితే మీ పర్సుకు చిల్లు ఖాయం. మీ పర్సనల్ బడ్జెట్ పెంచు కోవాల్సిన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి1 నుంచి కేంద్రం సిగరెట్ట, బీడీ, పాన్ మసాలపై జీఎస్టీ పెంచి ధరల మోతెక్కించేందుకు సిద్దమైపోయింది.


కనీసం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందన్న భావనతో అయినా ఆ అలవాటు మానుకుంటారేమోనని కేంద్రం భావిస్తుందేమో…అబ్బే మాకు అలాంటి పట్టింపులేవీ లేవండి అంటారా? సరే మీ ఇష్టం డబ్బులు ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉండండి అంటోంది. పాన్ మసాలా తయారీ, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచేలా కేంద్రం గత డిసెంబర్ లో పార్లమెంటులో రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రాబోతోంది.

స్మోకింగ్ ఈజ్ ఇన్జూరియస్ టు హెల్త్ …అని సిగరెట్టు ప్యాకెట్టు పై రాసినా…బీడీల ప్యాకెట్టుపై డేంజర్ అంటూ పుర్రెబొమ్మ ముద్రించినా పొగరాయుళ్ళకు అవేం పట్టవు. పాగతాగందే వారికి పొద్దుగడవదు. అలాగే పాన్ మసాలా కూడా. వాస్తవానికి ప్రభుత్వం వీటి తయారీ అనుమతించడంపైనే పలు అభ్యంతరాలున్నాయి. లిక్కర్, సిగరెట్, పాన్ మసాలా తయారీ అమ్మకాలపై ఎందుకు నిషేధం విధించరాదు.? అని సామాజిక సేవకులు పలు సందర్భాల్లో ప్రశ్నిస్తునే ఉన్నారుు. అయితే ఈ ప్రశ్నలకు గతంలో సమాధానం దొరకలేదు…మున్ముందు దొరకదు కూడా. ఉత్పత్తులపై వేటు వేయకుండా వాటిని వదిలేసి…వినియోగదారుల్ని పట్టుకుంటే లాభమేంటి? దీనిపై అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ మొగ్గు చూపవన్న విషయం అందరికీ తెలుసు…వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు , సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలు కావాలంటే…మందుబాబులు, పొగరాయుళ్ళ వద్ద నుంచి సొమ్ము వసూలు చేయాల్సిందే అన్న రూఢికొచ్చేశారు

కేంద్రం పాన్ మసాలా, సిగెరెట్,సంబంధిత పొగాకు ఉత్పత్తులపై 40 శాతం, బీడీలపై 18 శాతం జీఎస్టీ విధించేందుకు రంగం సిద్దం చేసింది. గత పార్లమెంట్ సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై అదనపు సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పాన్ మసాలా తయారీ పై ఆరోగ్య జాతీయ భద్రత సెస్సు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించబోతోంది. ఈ విషయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాదుతూ…ఇప్పటికే పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ విధిస్తున్నామని, సెస్సు దీనికి అదనమని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా సమకూరిన ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్య కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు స్పష్టీకరించారు.

ఇదే విచిత్రం అనిపిస్తుంది ఆలోచిస్తుంటే…బీడీలు, సిగరెట్లు, పాన్ మసాలాల వల్ల ఆరోగ్యం గుల్ల చేసుకుంటూ… కుటుంబాలను నడివీధుల్లోకి లాగేస్తుంటే…అది కనిపించదు. కాస్త డబ్బులు ఎక్కువ ఇవ్వు…నీ ఇష్టం వచ్చినంత తాగు. నీ ఆరోగ్యం దెబ్బతిన్నా మాకక్కర్లేదు…కానీ నీవిచ్చే ఆదాయంతో ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తాం. దేనికోసం ఆరోగ్యం వదులుకుంటున్నావో…దాని ఆదాయంతో వేరేవాళ్ళ ఆరోగ్యం బాగు చేస్తాం…ఈ లాజిక్ అస్సలు అర్థం కాదు. కేంద్రం, రాష్ట్రం ఈ విషయంగా దొందు దొందే అనిపిస్తుంటుంది. కొందరిని వ్యసనపరులుగా మార్చయినా సరే మరికొందరికి సంక్షమ కార్యక్రమాలు అందిస్తామనడం ఎంత వరకు సబబు. కానీ జరుగుతున్నది మాత్రం ఇదే.

కేంద్రం తాజా నోటిఫికేషన్ విడుదల చేయడంతో సిగరెట్ కంపెనీలు ఐటీసీ, గాడ్ ఫ్రే, ఫిలిప్స్ ల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. పిబ్రబరి1 నుంచి ధరలు పెరుగుతుండటంతో అనివార్యంగా ఉత్పత్తులు తగ్గి…నష్టాల బాటలో ఈ కంపెనీల స్టాక్స్ నష్టపోతున్నాయి. బీఎస్ ఈ లో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఫిలిప్స్ షేరులో 10 శాతం డౌన్ ట్రెండ్ అయ్యింది. మొత్తానికి పొగరాయుళ్ళకు, పాన్ మసాలా ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.