ప్రకృతిలో మనిషి ప్రాణాలు తీయగల జీవుల్లో పాములు ఒకటి. కొన్ని జాతుల పాములు ఒక్క కాటుతోనే మనల్ని చంపేస్తాయి. అందుకే వీటిని చూడగానే చాలా మంది భయపడతారు.
దాని విషం కన్నా అది కరిచిందన్న భయమే డేంజర్. దీంతో పాముల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి వాటిని చూడగానే చంపేస్తున్నారు. అయితే, ఇక నుంచి ఆ రిస్క్ ఉండదు. సర్పాలను వెంటాడాల్సిన అవసరమే లేకుండా ఓ చిన్న వస్తువుతో వాటిని తరిమేయవచ్చు. కేవలం రూ.5 విలువైన ఈ వస్తువును దగ్గర పెట్టుకుంటే పాములు మన దగ్గరికి రానేరావని చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందాం.
పాములన్నీ విషపూరితం కావు:
భూమి మీద ఎన్నో రకాల పాము జాతులు ఉన్నాయి. అయితే, వీటిలో అన్ని జాతులు విషపూరితం కావు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో నాన్ వీనమస్ పాముల జాతులే ఎక్కువగా ఉన్నాయి. కేవలం 4 జాతుల పాములు మాత్రమే విషపూరితమైనవి. అందులో కోబ్రా(Cobra), క్రైట్(Krait), రస్సెల్స్ వైపర్(Russell’s Viper), సా స్కేల్డ్ వైపర్(Saw- scaled Viper) జాతులు ఉన్నాయి. మన దేశంలోని మహారాష్ట్రలో ఈ పాముల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా మిగతా జాతుల పాములన్నీ విషపూరితం కావు. కొన్ని రకాల జాతుల పాముల్లో కొంచెం విషం ఉన్నప్పటికీ అవి ప్రాణాంతకం కావు. ఇవి కాటు వేసిన తర్వాత చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు.
స్నేక్ క్యాచర్లకు అప్పగించాలి:
భారతీయుల్లో పాములపై ఓ అపోహ నెలకొంది. వాటిని చంపేయడమే అల్టిమేట్ సొల్యూషన్‌గా భావిస్తున్నారు. అవి మనకు ఎలాంటి హాని చేయనప్పటికీ వాటిని ప్రాణాలతో ఉంచట్లేదు. దీంతో కొన్ని రకాల జాతులు మన దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు పాములను చంపకూడదని, చంపడం కాకుండా పాముల రిస్క్‌ని తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పర్యావరణ పరిరక్షకులు సజెస్ట్ చేస్తున్నారు. పాములను చూడగానే చంపడం కాకుండా వాటిని స్నేక్ క్యాచర్లకు అప్పగించాలని సూచిస్తున్నారు. దీంతో పాటు కొన్ని రకాల మొక్కలను మన దగ్గర పెట్టుకుంటే పాములు రావని చెబుతున్నారు.
ఈ మొక్క వేర్లు చాలా ప్రత్యేకం:
సర్పగంధ అనే మొక్క ఇంట్లో ఉంటే పాములు వాటి దరిదాపుల్లోకి కూడా రావు. ఈ మొక్క ఘాటైన వాసనను వెదజల్లుతుంది. పాములు ఇలాంటి గాఢత కలిగిన వాసనలను తట్టుకోలేవు. దీంతో అక్కడ ఎక్కువ సేపు ఉండలేవు. ఆ వాసన ఎటువైపు నుంచి వస్తే అటువైపు కూడా వెళ్లవు. మరోవైపు, ఈ మొక్క వేర్లను పాకెట్‌లో పెట్టుకుంటే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, ఎక్కువగా పొలం పనులు చేసేవారికి ఇది ఎంతో సహాయం చేస్తుంది. రూ.5 పెడితే సర్పగంధ వేర్లను కొనుగోలు చేయవచ్చు.
* ఇవి కూడా..
ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో కూడా పాములను దూరంగా పంపించవచ్చు. ఫినైల్ (Phenyl), బేకింగ్ సోడా, ఫార్మాలిన్, కిరోసిన్‌ను నీటిలో మిక్స్ చేసి పాములు ఎక్కువగా ఉండేచోటు, దాక్కునే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. పెరట్లో కూడా ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే పాముల బెడద పోతుంది.
(గమనిక: పైన తెలిపిన వివరాలు శాస్త్రీయంగా గుర్తించినవి కావు. కేవలం సమాజంలో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చినవి. )