పక్షుల్లా ఎగిరే పాములు.. అక్కడికి వెళ్లిన వారు ఎవరూ తిరిగిరాలేదు.. అంత డేంజర్..!

పాము పేరు వింటనే మనలో చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. పాము కనిపిస్తేనా.. పైప్రాణాలు పైనే పోతాయి. భయంతో గజగజా వణికిపోతాం. వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు పెడతాం.
ఒక్క పామును చూస్తేనే ఇలా అనిపిస్తే.. మరి వేల సంఖ్యలో పాములుంటే పరిస్థితి ఏంటి…? ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది కదా..! కానీ ఈ భూప్రపంచంలో ఒక ప్రాంతముంది. అక్కడ పాములు తప్ప ఇంకేమీ ఉండవు. అవి కూడా మామూలు పాములు కాదు. అత్యంత విషపూరితమైన పాములు (Venomous Snakes’ Island). కాటేస్తే.. క్షణాల్లో ప్రాణాలు పోతాయి. మరి అదెక్కడుంది? దాని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.


బ్రెజిల్‌లోని సావోపాలో (Sao Paulo) ప్రాంతంలో Ilha da Queimada Grande అనే ఐలాండ్ (Brazil Snake Island) ఉంది. దానిని పాముల దీవిగా కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ పాములే ఉంటాయి. అవి పదులు వందల్లో కాదు.. వేలాది రకాల పాముల అక్కడ నివసిస్తున్నాయి. ఈ ద్వీపం ఎన్నో ఏళ్లుగా విషపూరితమైన పాములకు నిలయంగా ఉంది. అందుకే అక్కడి మనుషుల ప్రవేశం లేదు. టూరిస్టులపైనా నిషేధం విధించారు. ఈ దీవి సావో పాలో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉండే పాములు చాలా ప్రమాదకరమైనవి. విషపూరితమైనవి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పాము గోల్డెన్-హెడ్ గోల్డెన్ లాన్స్‌హెడ్ వైపర్ పాము.. ఈ ద్వీపంలో మాత్రమే కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని రకాల పాములున్నాయి. అవి పక్షులపై దూకి కాటేస్తాయి. తక్కువ ఎత్తులో నుంచి ఏవైనా పక్షులు వెళ్తే.. వాటిపై దూకి చంపేస్తాయి. ఈ పాములు కాటేస్తే.. మనుషులు ఉక్కిరిబిక్కరవుతారు. క్షణాలోనే చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇల్హా క్విమడా గ్రాండె ద్వీపానికి మనషులను అనుమతించడం లేదు. సాధారణ ప్రజలు, పర్యాటకులపై నిషేధం విధించారు.

బ్రెజిలియన్ నేవీ, చికో మెండిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ (Chico Mendes Institute for Biodiversity Conservation) ఎంపిక చేసిన పరిశోధకులు మాత్రమే ఈ స్థలాన్ని సందర్శిస్తారు. 1909 నుంచి 1920 సంవత్సరాల మధ్య లైట్ హౌస్ ఆపరేషన్ కోసం కొంతమంది నివసించారు. ఆ తర్వాత సాధారణ ప్రజలెవరూ అక్కడికి వెళ్లలేదు. అరుదైన పాములను చంపేందుకు.. వేటగాళ్లు వస్తున్నారని కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ… కానీ ఇందులో నిజం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.