భార్య మీద అంత ప్రేమ.. మరో ‘తాజ్ మహల్’ కట్టించిన భర్త.

 భర్త తన భర్యపై అమితమైన ప్రేమ చూపించాడు. ‘తాజ్ మహల్’ లాంటి ఒక ఇంటినే తన భార్యపై ప్రేమకు గుర్తుగా కట్టించాడు. అచ్చం ఒరిజినల్ తాజ్ మహల్‌కు ఉన్న పాలరాతినే తన ఇంటి నిర్మాణానికి ఉపయోగించడం విశేషం.


పూర్తి వివరాల్లోకి వెళితే..

Mini Taj Mahal

అతడి పేరు ఆనంద్ ప్రకాశ్ చౌక్సే. ఆయనొక బడా బిజినెస్‌మ్యాన్. ఆయన తన భార్యకు గుర్తుగా మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్‌లో ‘తాజ్ మహల్’ను పోలి ఉన్న ఇంటిని కట్టించాడు. అది 4 బీహెచ్‌కే విల్లా తరహా ఉండే ఒక పాలరాయి భవనం. ఇండోర్ సమీపంలో ఉండే ఈ ఇల్లు ఇంటర్నెట్‌ను ఆకర్షించింది.

ఆగ్రాలోని ఒరిజినల్ తాజ్ మహల్‌లో ఉపయోగించిన మక్రానా పాలరాయినే.. ఇప్పుడు ఈ ఇంటికి వాడారు. అయితే ఆగ్రా తాజ్ మహల్ కంటే ఇది చాలా చిన్నది. దాని కంటే ఇది మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. కానీ నాలుగు వైపులా డోమ్, పిల్లర్లు అన్నీ ఒరిజినల్ తాజ్ మహల్ మాదిరిగానే ఉన్నాయి. అందమైన గుమ్మటాలు, ఎంతో అద్భుతంగా చెక్కిన స్తంభాలు, సుందరంగా వంచిన ద్వారాలు కలిగి ఉంది.

దీనిని 50 ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించారు. ఈ స్థలంలో బిజినెస్‌మ్యాన్ ఆనంద్ ప్రకాశ్ చౌక్సే స్థాపించిన పాఠశాల కూడా ఉంది. సమాచారం ప్రకారం.. ఈ విలక్షణమైన ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2 కోట్లు ఖర్చయింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.