Solar Light: కేవలం రూ.1000లకే సోలార్‌ లైట్‌.. మీ ఇంటిపై ఇన్‌స్టాల్‌ చేసుకోండిలా..

వర్షాకాలంలో ఇళ్లకు తరచుగా కరెంటు ఉండదు. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు లేదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారం సూర్యకాంతి.


సోలార్ లైట్లు విద్యుత్ దీపాల వలె పని చేస్తాయి. కానీ అవి సూర్యుని శక్తితో నడుస్తాయి. ఈ విద్యుత్తు పూర్తిగా ఉచితం. అలాగే ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా సులభం. ఇది మీకు కాంతిని ఇవ్వడమే కాకుండా మీ విద్యుత్ బిల్లును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది ఇన్‌స్టాల్‌ చేయడం కూడా సులభంగానే ఉంటుంది. మీరు దీనిని మీ టెర్రస్‌పైన ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అలాగే రోజంతా దాని నుంచి మీరు విద్యుత్‌ను పొందవచ్చు. దీని వల్ల మీరు విద్యుత్‌ కొతను అధిగమించవచ్చు. విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు సోలార్‌ లైట్లు మంచి ఎంపికగా ఉంటుందని గుర్తించుకోండి. ఇది మీ ఇంటిని పూర్తికాంతి వంతంగా చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

ఆటోమేటిక్ సోలార్ లైట్‌

మీ తేలికగా ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసే విధంగా మీ ఇంట్లో లైటింగ్‌ను ఎలా అమర్చాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమస్యకు పరిష్కారం ఆటోమేటిక్ సోలార్ లైట్లు. సోలార్ లైట్లను ఉపయోగించడం ద్వారా విద్యుత్‌ లేని సమయంలో మీ ఇంట్లో ఈ లైట్‌ వెలుగుతూనే ఉంటుంది. దీని వల్ల మీరు విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవచ్చు. సోలార్ లైట్లు మీ ఇంటిలోని ఏ మూలలోనైనా సులభంగా అమర్చవచ్చు. అవి సోలార్ ప్యానెల్స్ ద్వారా పగటిపూట సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను స్టోరేజ్‌ చేస్తుంది. అదనంగా దాని బ్యాటరీ సుదీర్ఘ కాలంగా ఉంటుంది. దృఢమైన నిర్మాణంతో ఈ లైట్ రాత్రిపూట కూడా చురుకుగా పని చేస్తుంది.

మీ ఇంటి పైకప్పుపై సోలార్ బల్బులను అమర్చండి:

మీరు మీ ఇంటి పైకప్పుపై బల్బులను అమర్చాలని ఆలోచిస్తున్నట్లయితే, సోలార్ బల్బులు మీకు సరైన ఎంపిక కావచ్చు. సూర్యకాంతి సులభంగా పైకప్పుకు చేరుకుంటుంది కాబట్టి ఈ బల్బులు ఎంతగానో పని చేస్తాయి. సౌర బల్బులు మీ ఇంటిని వెలిగించడానికి ఈ శక్తిని ఉపయోగించగలవు. ఇలాంటి సోలార్‌ లైట్లు మార్కెట్లో వెయ్యి రూపాయల నుంచే అందుబాటులో ఉన్నాయి.