‘సంబరాల ఏటి గట్టు’ నుంచి సాలిడ్ అప్డేట్..

మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్‌ చేసుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.


విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న తేజ్, ప్రస్తుతం చేస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ “సంబరాల ఏటి గట్టు” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా నుంచి, తాజాగా మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఆ పోస్టర్‌ను సాయి ధరమ్ తేజ్ స్వయంగా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేశారు. అందులో తేజ్ తన సిక్స్ ప్యాక్ లుక్‌తో, అద్భుతమైన డైనమిక్ ప్రెజెన్స్‌తో కనిపించడం నెటిజన్లలో ట్రెమెండస్ హైప్ క్రియేట్ చేసింది. అంతే కాదు ప్రస్తుతం ఈ చిత్రం ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌లో ఉంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో కాన్సెప్ట్‌ ఆధారిత యాక్షన్ బ్లాక్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ మరింత గ్రాండియర్ స్థాయిలో రూపొందుతుందన్న నమ్మకం పెరిగింది. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్, సినీప్రేక్షకులు సోషల్ మీడియాలో “తేజ్ లుక్ అదిరిపోయింది”, “పాన్ ఇండియా లెవెల్‌లో ఘన విజయం సాధించాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతుండటంతో, ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి, “సంబరాల ఏటి గట్టు” నుంచి వచ్చిన ఈ తాజా అప్డేట్ మెగా ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పీక్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.