కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగంలో చేరారు.
ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యబృందం పర్యవేక్షణ కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 9న కూడా సోనియా ఇదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు ఈ నెల 7న అధిక రక్తపోటు కారణంగా సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరి వైద్యపరీక్షలు చేయించుకున్నారు.
































