Blue Origin : స్పేస్ టూరిస్ట్ గా తెలుగోడు.. అంతరిక్షం చివరి అంచుకు ప్రయాణం..

Blue Origin : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే కంపెనీకి చెందిన న్యూ షెఫర్డ్ అనే అంతరిక్ష నౌక మరో చారిత్రాత్మక ప్రయాణానికి సిద్ధమైంది. స్పేస్ టూరిజాన్ని పెంచే క్రమంలో భాగంగా రూపొందించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ లో.. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ తో సహా ఆరుగురు.. అంతరిక్షం చివరి అంచు వరకు ప్రయాణించనున్నారు. వాస్తవానికి ఈ అంతరిక్ష నౌక ఎప్పుడో స్పేస్ లోకి వెళ్లాల్సి ఉండేది. అయితే అనుకొని అవాంతరాల వల్ల వాయిదా పడింది. చివరికి ఎట్టకేలకు నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి ఎగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ టెక్సాస్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది.. ఈ న్యూ షెఫర్డ్ స్పేస్ క్రాఫ్ట్ లో గోపీచంద్ తోటకూర తో పాటు మరో ఐదుగురు అంతరిక్షం చివరి అంచు వరకు వెళ్లారు. అందులో మాసన్ ఏంజెల్, సిల్వర్ చిరోన్, కెన్నెత్, కరోల్ షాలర్, ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్ డ్వైట్ ఉన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ కు బ్లూ ఆరిజన్ సంస్థ NS -25 mission అని పేరు పెట్టింది.


ఎవరి గోపీచంద్ తోటకూర

గోపీచంద్ తోటకూర స్వగ్రామం విజయవాడ. ఇతడి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. గోపీచంద్ కు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే విమానయానం మీద ఆసక్తి కలిగింది. ఆ వయసులోనే అతడు కేఎల్ఎం ఎయిర్ క్రాఫ్ట్ లోని కాక్ పిట్ లో అడుగుపెట్టాడు.. అప్పట్లో కలిగిన ఉత్సుకత అతడిని విమానయాన రంగం వైపు నడిపించింది. గోపీచంద్ ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ కోర్సు చదివాడు.. ఏవిషన్లో విభిన్నమైన పనులకు నాంది పలికాడు. అతడు కమర్షియల్ జెట్ ఫ్లయింగ్, బుష్ ఫైలటింగ్, ఏరోబాటిక్స్, సీ ప్లేన్ ఆపరేషన్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి విభాగాలలో పలు రకాల కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఇతనికి పర్వతాలను అధిరోహించడం అంటే చాలా ఇష్టం. గతంలో కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఆ తర్వాత అతడికి కొత్త ఎత్తులను జయించాలనే కోరిక పుట్టింది. గోపీచంద్ ఫ్రీజర్వ్ లైఫ్ కార్ప్ అనే సంస్థకు సహా వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఇది మన దేశంలో వైద్య పరంగా రవాణాను పెంచింది. ఇతడు దాదాపు 2000 పైగా మెడికల్ ఎయిర్ అంబులెన్స్ మిషన్లను నిర్వహిస్తోంది. ఇక అట్లాంటాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గోపీచంద్ వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాడు. గోపీచంద్ కు అంతరిక్ష యానం అంటే చాలా ఇష్టం. ఇందులో భాగంగానే జస్ట్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్ లో అతడు ప్రయాణిస్తున్నాడు.

ఇతర అంతరిక్ష యాత్రికుల వివరాలివి..

గోపీచంద్ తర్వాత.. ఆ క్యాప్సుల్ లో మరో అయిదుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎడ్ డ్వైట్ ఒకరు. ఈయన ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్. 1961 లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెన్నడి తర్వాత అంతరిక్ష యానం చేసిన నల్లజాతీయుడిగా పేరుపొందాడు. ఇతడు 1961 లో కెన్నడి ఏరోస్పేస్ రీఛార్జ్ పైలెట్ స్కూల్లో శిక్షణ పొందాడు.

మేసన్ ఏంజెల్ ఇండస్ట్రియస్ వెంచర్స్ నడుపుతున్నాడు. సిల్వైస్ చిరోన్, బ్రస్సెరీ.. మోంట్ బ్లాంక్ వ్యవస్థాపకుడు. కెన్నెత్ ఫ్యామిలీ ట్రీ మేకర్ ను సృష్టించాడు. కరోల్ షాలర్ విశ్రాంత సీపీఏ. అతడికి ఉన్న అనారోగ్యం వల్ల ఆంధ్రుడిగా మారే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసాన్ని స్వీకరించాడు.

ఎలా నడుస్తుందంటే..

బ్లూ ఆరిజిన్ భూమి ఉపరితలం నుంచి 62 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న కర్మన్ రేఖ కు మించి క్యాప్సూల్ ముందుకు నడిపిస్తుంది. ఇది బాహ్య అంతరిక్షం సరిహద్దుగా ప్రయాణం సాగిస్తుంది. క్యాప్సూల్ లో ఉన్న ప్రయాణికులు భూమిని దాటిన తర్వాత క్యాబిన్ కిటికీలో భార రహిత స్థితిని అనుభవిస్తారు.

రెండు సంవత్సరాల క్రితమే..

బ్లూ ఆరిజిన్ రెండు సంవత్సరాల క్రితమే న్యూ షెఫర్డ్ రాకెట్ ను ప్రయోగించింది. అయితే ఈ మిషన్ టెక్సాస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత విఫలమైంది. దీంతో నాసా రాకెట్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్ష యాత్రికులను బయటికి పంపించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2022 లో ఈ ప్రయోగం నిర్వహించగా.. అంతరిక్ష నౌక, న్యూ షెఫర్డ్ రాకెట్ విఫలమయ్యాయి. విమానం, రాకెట్ మాక్స్ క్యూ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత రాకెట్ నుంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఆన్ బోర్డ్ కంప్యూటర్లు వైఫల్యాన్ని గుర్తించి.. ఇంజన్ ను షట్ డౌన్ చేశాయి. దీంతో రాకెట్ తిరిగి నేలపై కూలిపై ధ్వంసం అయింది. ఊహించిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఇంజన్ నాజిల్ విఫలమైందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఆ తర్వాత బ్లూ ఆరిజిన్ డివైస్లను పూర్తిగా మార్చింది. ఆదివారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఎనిమిది గంటల 30 నిమిషాలకు నింగిలోకి పంపించింది.