మెగాస్టార్ క్లాప్‌తో మొదలైన ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబో ప్రారంభం!

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్‌ యాక్షన్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్ ఎట్టకేలకు నేడు అధికారికంగా ప్రారంభమైంది.


‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుక (Mahurat Ceremony) నేడు ఘనంగా జరిగింది.

‘స్పిరిట్’ టీమ్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ముహూర్తపు పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి క్లాప్‌తో తొలి షాట్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ (T-Series), సందీప్ రెడ్డి వంగా, మరియు ప్రణయ్ రెడ్డి వంగా (Bhadrakali Pictures) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థలు ప్రమోషన్స్‌లో భాగంగా #OneBadHabit అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.