నాలుకపై నల్లటి మచ్చలు కనిపిస్తే అదృష్టమని, వారు ఏదైనా చెబితే చాలా వరకు నిజం అవుతుందని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది కేవలం మూఢ నమ్మకం మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నాలుకపై నల్లటి, తెల్లటి, ఎర్రటి రంగుల్లో ఏర్పడే మచ్చలు వాస్తవానికి శరీరంలో ప్రారంభమయ్యే కొన్ని రకాల వ్యాధుల లక్షణాలు కూడా కావచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా ల్యూకోప్లాకియా (Leukoplakia) లేదా ఓరల్ థ్రష్ (Oral Thrush), క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రారంభం లక్షణాల్లో నాలుకపై మచ్చలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
కేవలం మచ్చలే కాకుండా నాలుక ఆధారంగా పలు రోగాలను గుర్తింవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నల్లటి, తెల్లటి మచ్చలు మచ్చలు కనిపించడం, క్రీమ్ వంటి తెల్లటి పదార్థం నాలుకపై ఉత్పత్తి అవుతుండటం అనుమానించ దగినవివే. ఎందుకంటే ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు సంభవించే లక్షణాలని పేర్కొంటున్నారు. అట్లనే కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. నల్లటి మచ్చలు ఏర్పడి క్రీమ్ వంటి పదార్థం ఎక్కువగా కనిపిస్తే అది ల్యుకోప్లాకియా వ్యాధికి దారితీస్తుందని, క్రమంగా క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నాలుకపై అనుమానాస్పద మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
































