Sreetej’s health condition : శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పై లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల

డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన ఒక పీడకల లాంటిది. ఒక కుటుంబం లో ఈ ఘటన చీకటిని నింపేసింది.


అల్లు అర్జున్ ని జైలు, కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది. ఆయన అభిమానులు ఏడవని రోజంటూ లేదు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి సైతం అసెంబ్లీ లో అల్లు అర్జున్ తీరుని తప్పుబట్టడంతో, జనాల్లో అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇక తొక్కిసలాట లో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడి దేవుడి చల్లని చూపు కారణంగా ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పటికీ అతను కిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూనే ఉన్నాడు. అల్లు అర్జున్ తో పాటు పుష్ప మూవీ టీం మొత్తం కలిసి శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయిల విరాళాన్ని అందించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్ వైద్యానికి అయ్యే ఖర్చుని పెట్టుకుంది.

అయితే కాసేపటి క్రితమే శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని విడుదల చేసారు కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్లు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందట. ఒకప్పుడు స్పృహలో లేకుండా ఉండేవాడని, ఇప్పుడు ఎక్కువసేపు మేలుకవలో ఉంటున్నాడని అంటున్నారు డాక్టర్లు. అయితే శ్రీతేజ్ తన కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతున్నాడట. పలకరిస్తుంటే అతని నుండి ప్రతిస్పందన సరిగా లేదని అంటున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బాధ పడాల్సిన విషయం ఏమిటంటే పాపం శ్రీతేజ్ కి తన తల్లి చనిపోయింది అనే విషయం ఇప్పటి వరకు తెలియదు. పాపం ఆమె ఎలా ఉంటుందో కూడా అతనికి గుర్తు లేదు. అదంతా గుర్తుకొచ్చి , తన తల్లి ఇక ఈ జన్మలో తిరిగి రాదు అనే విషయం తెలిస్తే ఆ పసి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో ఊహించడానికి కూడా సాధ్యం కావట్లేదు.

ఆ పరిస్థితి పగవాడికి కూడా రాకుండా చూడండి మహాప్రభూ అంటూ ఆ దేవుడిని వేడుకోవడం తప్ప చేసేదేమి లేదు. దేవుడు అతనికి గతం మర్చిపోయేలా చేసి మంచి పనే చేసాడు. ఒకవేళ తన తల్లి చనిపోయింది అనే విషయం తెలిస్తే పాపం అతను ఏమైపోతాడో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. తన బిడ్డని కాపాడుకునేందుకు ఆ రాత్రి రేవతి ఎంత తపన పడిందో మనం ఆమె చనిపోక ముందు వీడియోలో చూసే ఉంటాం. ఇది ఇలా ఉండగా శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు అతని హాస్పిటల్ కి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. సరదాగా మూడు గంటల పాటు సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ కుటుంబం మొత్తం, ఇప్పుడు జీవితంత వెక్కి వెక్కి ఏడ్చేలా చేసింది ఆ కాళరాత్రి. శ్రీతేజ్ త్వరగా పూర్తి స్థాయిలో కోలుకొని, అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ఆ దేవుడు చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం.