Sridhar Vembu : చూస్తే పల్లెటూరి వ్యక్తిలా కనిపిస్తాడు.. కాని ఏకంగా రూ.2700 కోట్లు సంపాదిస్తున్నాడు..!

కొందరికి డబ్బు ఎక్కువ ఉంటే కళ్లు నెత్తిమీద ఉంటాయి. ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడి మూలాలు మర్చిపోతారు. తన కంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తారు.


అయితే శ్రీధర్ వెంబు Sridhar Vembu అనే వ్యక్తి మాత్రం విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు. తన ఆధ్వర్యంలోని జోహో కార్పొరేషన్‌ను 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మార్చారు. అంతేకాదు, ఆయన నికర ఆస్తిపాస్తుల విలువ 28,000 కోట్ల రూపాయలని అంచనా. ఫోర్బ్స్ ‍ డేటా ప్రకారం, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో

శ్రీధర్ వెంబు Sridhar Vembu సేవలకు ప్రతిగా పద్మశ్రీ పురస్కారం వరించింది. రూ.9 వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీకి & రూ.28 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్నప్పటికీ శ్రీధర్‌ వెంబు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. రెండేండ్ల క్రితం ఓపెన్‌ ఏఐ అనే స్టార్టప్‌ సంస్థ తీసుకొచ్చిన ఏఐ బేస్డ్‌ చాట్‌జీపీటీ తో టెక్నాలజీ వరల్డ్‌ రూపురేఖలే మారిపోయాయి. అప్పటికే మెషిన్ లెర్నింగ్‌, ఆటోమేషన్ వంటి టూల్స్‌ .. ఐటీ, టెక్నాలజీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రాకతో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జోహో కార్పొరేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా శ్రీధర్ వెంబు పని చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో, జోహో కార్పొరేషన్ ప్రస్తుతం 2,800 కోట్ల రూపాయల లాభాల సంస్థగా అవతరించింది.

ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకుంటున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అంతేకాదు, రాకపోకల కోసం సైకిల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇటీవల, శ్రీధర్ వెంబు ఒక కొత్త వాహనం కొన్నారు. ఆ వాహనం ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తే అవి తెగ వైరల్‌ అయ్యాయి. నెటిజన్ల నుంచి లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. జోహో కార్పొరేషన్ సీఈఓ ఉపయోగిస్తున్న కొత్త వాహనం… ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. శ్రీధర్ వెంబు వద్ద టాటా నెక్సాన్ ఈవీ కూడా ఉంది. ఆయన స్టార్ట్ చేసిన జోహో కార్పొరేషన్‌ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి, శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. అయితే జోహో సీఈఓగా ఉన్న శ్రీధర్ వెంబూ .. ఆ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్షియేటివ్స్‌ వైపు.. అంటే జోహో చీఫ్‌ సైంటిస్ట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.